E-Paper
Advertisement

హైదరాబాద్‌లో మూడో బస్సు టెర్మినల్.. 100 ఎకరాలు కేటాయింపు, మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

హైదరాబాద్‌లో మూడో బస్సు టెర్మినల్.. 100 ఎకరాలు కేటాయింపు, మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన
Advertisement

Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు భారీ శుభవార్త. నగరంలో ప్రధాన బస్ స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించేందుకు గాజుల రామారంలో ఆధునిక వసతులతో కూడిన నూతన బస్ టెర్మినల్‌ను నిర్మించేందుకు అంతా రెడీ అయ్యింది. సుమారు 100 ఎకరాల్లో నిర్మాణం కానున్న ఈ టెర్మినల్.. ప్రయాణికులకు వరంగా మారనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

 

హైదరాబాద్‌లో కొత్తగా మూడో బస్సు టెర్మినల్

Advertisement

రోజు రోజుకూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతోంది. ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటివి ఏర్పాటు చేసినా ట్రాఫిక్ తగ్గలేదు. దీనికితోడు మెట్రో రైలు అందుబాటులో ఉన్నా కష్టాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ఇతర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆర్టీసీ-ప్రైవేట్ బస్సులు హైదరాబాద్‌కు అధికంగా వస్తున్నాయి.

హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ఆర్టీసీ బస్సులు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఎంజీబీఎస్, జేబీఎస్‌ బస్ స్టేషన్‌లు ఉన్నాయి. ఒత్తిడి ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో మరో బస్టాండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ఆర్టీసీ 100 ఎకరాల్లో అత్యాధునిక బస్‌ టెర్మినల్‌ నిర్మించాలని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి ప్రకటన చేశారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

Advertisement

 

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన

కొత్త బస్‌ డిపో నిర్మాణం కోసం హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలోని గాజుల రామారం దగ్గర 100 ఎకరాలు కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జగద్గిరిగుట్ట నుంచి 28 జిల్లా బస్సులు, 47 సిటీ బస్సులు రోజూ తిరుగుతాయి.

బస్‌ డిపో-టెర్మినల్‌ నిర్మాణం కోసం తెలంగాణ ఆర్టీసీ 99 ఏళ్లకు లీజుకు తీసుకోవడానికి హెచ్‌ఎంటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వలేమని ఐదేళ్లకొకసారి చొప్పున 20 ఏళ్లకు ఇస్తామని హెచ్‌ఎంటీ అధికారులు తెలిపారు. అందుకోసం ప్రతీ ఏటా రూ.6 కోట్ల లైసెన్స్‌ ఫీజు చెల్లించనుంది. ఈ ప్రతిపాదనకు ఆర్టీసీ అంగీకరించలేదు.

 

దాదాపు 100 ఎకరాల్లో నిర్మాణం

ఆ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం గాజుల రామారం దగ్గర హెచ్‌ఎంటీ భూములకు సమీపంలో 100 ఎకరాలు కేటాయించినట్టు సదరు కేంద్రమంత్రి వివరించారు. అక్కడ ఏర్పాటు చేయబోయే కొత్త డిపోలో ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసుల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. సిటీ బస్సుల కోసం మరో టెర్మినల్ రానుంది.

ALSO READ: చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఏపీ-తెలంగాణల్లో వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్

ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. కేవలం తెలంగాణలోని జిల్లాల నుంచి వచ్చే బస్సుల కోసం కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన బస్సులు కొత్త డిపోకు వెళ్లనున్నాయి.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×