BigTV English

Telangana: నాన్‌స్టాప్ రెయిన్స్.. తెలంగాణ ఆగమాగం..

Telangana: నాన్‌స్టాప్ రెయిన్స్.. తెలంగాణ ఆగమాగం..
rain

Telangana rain updates(Latest news in telangana): తెరిపినివ్వని వర్షంతో.. తెలంగాణపై పూర్తిగా ముసురు కమ్మేసింది. రెండు రోజుల నుంచి ఒకే తరహా వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో అయితే రోజుల తరబడి వాన కురుస్తోంది. అసలు సిసలైన వర్షాకాలాన్ని గుర్తు చేస్తోంది. మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అతిభారీ వర్షాలు కురుస్తాయనేది వెదర్ రిపోర్ట్.


ఈ సారి వానాకాలం సీజన్ ప్రారంభమైన తర్వాత.. తొలిసారిగా హైదరాబాద్ నగరమంతా ముసురు పట్టుకుంది. నగరంపై రోజుల తరబడి మబ్బులు కమ్మేశాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. సూర్యుడు కనిపించక చాలాకాలం అయింది. నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వానతో.. రోడ్లు, వీధులన్నీ తడిసి ముద్దైపోయాయి. మూడు రోజుల నుంచి హైదరాబాద్ ను ముసురు వదలడం లేదు. చాలాచోట్ల ట్రాఫిక్ సమస్యలు. వర్షాలకు గ్రేటర్ లో విద్యుత్ సమస్య తలెత్తింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో 200 లకు పైగా ఫీడర్లు ట్రిప్పవడంతో.. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే వచ్చే 5 రోజుల పాటు.. నగరవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించిన తర్వాత ఈ స్థాయిలో ఇప్పుడే వానలు పడుతున్నాయి. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. అల్పపీడనంగా మారడంతో పాటు.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా మరో 5 రోజు పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. మంచి వర్షాలు కురుస్తుండటంతో.. రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×