E-Paper
Advertisement

పాత నోట్ల పేరుతో రూ.70 కోట్ల దందా.. AIని వాడి విచిత్ర మోసం!

పాత నోట్ల పేరుతో రూ.70 కోట్ల దందా.. AIని వాడి విచిత్ర మోసం!
Advertisement

 Old Coin Scam: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఒక్క రూపాయి పాత నోటు ఉందా? ఐదు కోట్లు ఇస్తాం, 25పైసల నాణెం ఇస్తే రెండు కోట్లు అంటూ ఊరించే యాడ్స్ కనిపిస్తాయి. ఐదు రూపాయల పాత నోటు ఇస్తే కోట్లు మీవే అంటూ ఊరిస్తారు. ఇంట్లో పాత నాణెం ఉన్నవాళ్లకు ఆశ పుట్టేస్తుంది. వెంటనే ఫోటో తీసి పంపిస్తారు. ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తారు. అక్కడే మొదలవుతుంది అసలు ఆట. ముందు నమ్మిస్తారు, మీ నాణెం చాలా రేర్, ఐదు కోట్లు గ్యారంటీ అని ఊరిస్తారు. ఆధార్, అకౌంట్ డీటెయిల్స్ లాగేస్తారు. తర్వాత… GST పదివేలు, RBI ఫీజు ఇరవై ఐదు వేలు, కస్టమ్స్ క్లియరెన్స్ యాభై వేలు. డాక్యుమెంటేషన్‌ ఫీజు ఇలా రోజుకో కారణం, పూటకో బిల్లు పంపిస్తారు. ఈ మోసం ఇంతటితో ఆగదు.. మరో నెంబర్ నుంచి కాల్ చేసి తాను డీఎస్‌పినని భయపెట్టిస్తారు. పాత నోట్ల దందా చేస్తున్నావని బెదిరించి మళ్లీ బ్లాక్‌మెయిల్ చేస్తారు. డబ్బుల ఆశతో ఆ ఫీజులు అన్ని పంపిస్తే.. చివరకు మిగిలేది అప్పులు.. కన్నీళ్లే.

రూపాయి నోటు ఉంటే రూ. 45 లక్షలా?

Advertisement

హైదరాబాద్‌లోనూ ఇలాంటి మోసమే జరిగింది. ఓ వ్యక్తి దగ్గర దశలవారీగా 3లక్షల 61 వేలు గుంజేశారు. డబ్బులన్నీ పడగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. బాధితుడు పోలీసుల తలుపు తట్టడంతో దందా గుట్టు రట్టయింది. మరోవైపు ఫేస్‌బుక్‌లో పాత ఒక్క రూపాయి నోటుకు 45 లక్షలు ఇస్తామని చెప్పి ఇంకో బాధితుడి నుంచి 7లక్షల 93 వేలు కొట్టేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

డీప్‌ఫేక్ వీడియోలు, 70 మ్యూల్ అకౌంట్లు..

Advertisement

అసలు షాక్ ఇప్పుడే.. కమీషన్ ఆశ చూపి, 70కి పైగా మ్యూల్ అకౌంట్లు పోగేసి సైబర్ నేరగాళ్లకు అందించారు. ఈ నెట్‌వర్క్‌తో దేశమంతా 450కేసులు, 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇంకో ట్విస్ట్… ఇప్పుడు AIని కూడా వాడుతున్నారు. సూరత్‌లో ఓ ప్రముఖుడి ఫోటోతో deepfake వీడియో చేసి, పాత నాణేలు కొంటామని ప్రచారం చేశారు. ఆ ముఠా ఖాతాల్లో 9కోట్ల 84లక్షల లావాదేవీలు జరిగాయి. ఫేక్ వీడియో నిజమని నమ్మి వేల కిలోమీటర్లు ప్రయాణించిన వాళ్లూ ఉన్నారు.

కొనేవాడు అడగడు.. అడిగితే స్కామే!

మరి నిజం ఏంటి? పాత నాణేలకు అసలు విలువ ఉండదా? అంటే ఉంటుంది. కానీ అమ్మేది ఆఫీషియల్ ఆక్షన్లు, రిజిస్టర్డ్ డీలర్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలి. సోషల్‌ మీడియాలో కోట్లు ఇస్తామంటూ కనిపించే ప్రతి యాడ్‌నూ నమ్మొద్దు. ముఖ్యంగా నాణెం కొంటామని చెప్పి ముందుగా ఫీజులు కట్టమంటే.. అక్కడే అలర్ట్‌ అవ్వండి! గుర్తుంచుకోండి బాసూ.. కాయిన్ కొనేవాడు మీ దగ్గర డబ్బు అడగడు, అడిగాడంటే వందకి వంద శాతం స్కామే.

Also Read: సంచి నిండదు.. జేబులు ఖాళీ.. సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ద్రవ్యోల్బణం!

Tags

Related News

సౌత్ అయినా.. నార్త్ అయినా సీఎం రేవంత్ వ్యూహం ఓక్కటే.. అటాక్ మోడీ!

యాసంగిలో వరి సాగు వద్దు.. ఆరుతడి పంటలే ముద్దు: మంత్రి తుమ్మల

సింగరేణి కార్మికులకు డిప్యూటీ సీఎం బంపర్ ఆఫర్.. దసరా బోనస్ ఎంతంటే?

తెలంగాణలో గుబులు రేపుతున్న ఫేక్ సర్టిఫికెట్ల అంశం.. షాకింగ్ విషయాలు వెలుగులోకి, బీఆర్ఎస్‌లో వణుకు

రాహుల్ గజం ఎగిరితే.. రేవంత్ రెండు గజాలు ఎగురుతున్నాడు!: కిషన్ రెడ్డి

క్యూర్ చట్టం ఎఫెక్ట్‌.. మున్సిపల్ పాలనలో ఇక అంతా పబ్లిక్‌!

నోటీసులు లేకుండానే ఓట్లు తొలగిస్తారా? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించాలి!- కూనంనేని

Big Stories

Advertisement
×