UPI Charges: యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపే వ్యాపారులకు బిగ్ రిలీఫ్. ఎండీఆర్ ఛార్జీల అమలు వాయిదా పడింది. ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ఎన్‌పీసీఐ ప్రకటించింది. దేశంలో ఫెస్టివల్ సీజన్ మొదలుకావడంతో వ్యాపారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార వర్గాలకు బిగ్ బూస్ట్.
ఈ వ్యవహారంపై నిర్ణయం చెప్పేందుకు మంగళవారం సమావేశమైంది యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన పర్సన్-టు-మర్చంట్ యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్- ఎండీఆర్‌ను దీపావళి తర్వాత అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్‌పీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 15న అమలు కావాల్సిన ఆ ఛార్జీలు కాస్త నవంబర్ రెండో వారానికి వాయిదా పడింది. అప్పుడు అమలు చేస్తుందా? సంక్రాంతి వరకు విడతల వారీగా వాయిదా వేస్తుందా? అనేది చూడాలి. దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ UPIని NPCI నిర్వహిస్తుంది.
పండుగ అమ్మకాలకు ముందు వినియోగదారుల సెంటిమెంట్, మారుతున్న MDR రేట్లు, వివిధ UPI లావాదేవీలకు వాటి వర్తింపుపై ఆందోళనలను ఉటంకిస్తూ అమలును వాయిదా వేయాలని వ్యాపార సంఘాలు-చెల్లింపుల కంపెనీలు NPCIని అభ్యర్థించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. MDR ప్రకటన వెలువడినప్పటి నుండి వ్యాపారులు, రాజకీయ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సెప్టెంబర్‌లో యూపీఐ స్టీరింగ్ కమిటీ సమావేశంపై రూ.2000కు మించిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించాలని నిర్ణయం తీసుకుంది.
వ్యాపారి రూ.2,000 పైన చేసే ప్రతీ లావాదేవీపై రూ.8, అదే రూ.10000 లావాదేవీపై రూ.40 చెల్లించాలి. ఈ ఛార్జీల భారం వినియోగదారులపై ఉండదని తేల్చిచెప్పింది. కేవలం వ్యాపారులు చెల్లించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. పెద్ద లావాదేవీ చేసినా గరిష్ఠంగా రూ.300 మించి ఛార్జీ పడదు. ఎగ్జాంఫుల్ రూ.75 వేలు అంతకంటే విలువైన లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 వసూలు చేస్తారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, వ్యవసాయ ముడిసరుకులు వంటి కీలక రంగాల్లో రూ.2000 దాటిన ప్రతీ లావాదేవీలకు రూ.5 ఛార్జీ ప్రతిపాదించారు.
ALSO READ: ట్రాఫిక్ జామ్‌లో రూ.20 ఐడియా.. నేడు నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే!
వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు, రోజువారీ చిన్న వ్యాపార లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని పేర్కొంది. వేసిన ఛార్జీలు యూపీఐ వ్యవస్థ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, కస్టమర్ సపోర్ట్ వంటి మౌలిక సదుపాయాలకు ఈ ఛార్జీలను ప్రతిపాదించినట్టు వివరించింది కేంద్రం.
UPI MDR on Select Merchant Transactions Shall be Implemented Post Diwali
Press Release Link: https://t.co/5KMjOP0tHd pic.twitter.com/pD8IKfN6sR
— NPCI (@NPCI_NPCI) October 13, 2026