Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు తప్ప, అందర్నీ అధికారులు విచారించారు. లేటెస్ట్‌గా మాజీ డీసీపీ రాధా కిషన్‌రావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. రాధా కిషన్‌రావు మామ వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నాలుగురోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు ఇచ్చింది.
మధ్యంతర బెయిల్ ఇచ్చే క్రమంలో పలు సూచనలు చేసింది న్యాయస్థానం. వర్థంతి కార్యక్రమం జరిగే ప్రదేశానికి ఎస్కార్ట్‌తో తీసుకెళ్లనున్నారు పోలీసులు. ఎలాంటి ఫోన్ ఉపయోగించరాదని పేర్కొంది. దీన్ని పర్యవేక్షించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ప్రయాణ ఖర్చులు, ఎస్కార్ట్ ఛార్జీలు రాధా కిషన్‌రావు భరించాలన్నది మరో షరతు. తిరిగి శనివారం సాయంత్రం ఆయన జైలుకు వెళ్లనున్నారు.
అంతకుముందు ఈ కేసుకు సంబంధించి శ్రవణ్‌రావు బెయిల్ పిటిషన్ సందర్భంగా పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి నలుగురు నిందితులతో బేగంపేట్ ఎస్ఐబీ ఆఫీసులో ఏ- 6 నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావు సమావేశం నిర్వహించినట్టు పేర్కొంది.
గత ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ.. రాజకీయ ప్రత్యర్థులపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో డబ్బులు అందకుండా కఠిన చర్యలు చేపట్టింది. చివరికి అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. దీంతో ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేయాలనే కుట్ర తెరలేపినట్టు వివరించింది.
ALSO READ: ఫార్ములా కేసులో కీలక పరిణామం, ఆపై నోటీసులు, ఢిల్లీ స్థాయిలో మంతనాలు
ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాను రప్పించేందుకు అధికారులు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచి రాకుండా ఆయన ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. ఓ వైపు గ్రీన్ కార్డు సంపాదించుకున్న ఆయన, మరోవైపు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని యూఎస్ ప్రభుత్వానికి అప్లై చేశారు. కొత్త ప్రభుత్వం ఆయన దరఖాస్తుపై క్లారిటీ ఇవ్వనుంది.