BigTV English

pm modi: పే పీఎం.. నోట్ల రద్దుపై మోదీకి పంచ్..

pm modi: పే పీఎం.. నోట్ల రద్దుపై మోదీకి పంచ్..

pm modi : పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం ఘనంగా ప్రకటించారు ప్రధాని మోదీ. దొంగ నోట్ల చెలామణికి చెక్ పడుతుందని చెప్పారు. డిజిటల్ ఇండియా సాకారమవుతుందని అన్నారు. సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. దేశానికి మంచి జరుగుతుందనే నమ్మకంతో భరించారు. అలా అలా ఏళ్లు గడుస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దు చేసి ఇప్పటికి ఆరేళ్లు అవుతోంది. 5వందలు, వెయ్యి నోట్లు పోయి.. వాటి స్థానంలో 2వందలు, 2వేల నోట్లు వచ్చాయి.


ఆరేళ్ల తర్వాత చూస్తే పాత నోట్లే కాదు.. కొత్తగా రిలీజ్ చేసిన 2వేల నోట్లు కూడా కనిపించకుండా పోయాయి. ఏ నల్లధనం రూపుమాపడానికైతే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారో.. ఇప్పుడు కొత్తగా ప్రింట్ అయిన పెద్ద నోట్లు సైతం మాయం అవుతుండటంతో అసలు ఉద్దేశ్యం నెరవేరిందా అనే అనుమానం.

అప్పటికంటే ఇప్పుడే నగదు చలామణి ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. అక్టోబరు 21 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 30.88లక్షల కోట్లతో కొత్త గరిష్ఠానికి చేరిందనేది కాంగ్రెస్ వాదన. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 72శాతం ఎక్కువంటూ నోట్ల రద్దుపై తీవ్ర విమర్శలు చేస్తోంది కాంగ్రెస్.


నోట్ల రద్దు ప్రకటన చేసి ఆరేళ్లు అవుతున్న సందర్బంగా.. రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. తన బిలియనీర్‌ స్నేహితుల కోసమే ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ప్రధానిని ‘పేపీఎం’ అంటూ విమర్శించారు. ఆ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు రాహుల్ గాంధీ.

‘చిన్న, మధ్యతరహా వ్యాపారాలను సమూలంగా తుడిచిపెట్టి.. తన బిలియనీర్‌ స్నేహితులైన ఇద్దరు ముగ్గురికి భారత ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం అందించడం కోసం PayPM ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన చర్య ఈ నోట్ల రద్దు’ అంటూ రాహుల్‌ ట్వీట్ చేశారు.

నోట్ల రద్దు వైఫల్యాలపై వచ్చిన పలు కథనాలు, అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలు, సామాన్యుల కష్టాలతో ఉన్న ఓ వీడియోను రాహుల్ షేర్ చేశారు.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×