E-Paper
Advertisement

RajaSingh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీస్ నోటీసులు.. మళ్లీ అరెస్ట్?

RajaSingh: ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీస్ నోటీసులు.. మళ్లీ అరెస్ట్?
Advertisement

RajaSingh: వదల బొమ్మాళీ స్టైల్ లో వెంటాడుతున్నారు పోలీసులు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను మళ్లీ జైలుకు పంపించే వరకూ వదిలేలా లేరు. ఇప్పటికే పీడీ యాక్ట్ లో జైలుకు పంపి బెయిల్ పై బయటకు వచ్చిన రాజాసింగ్ కు లేటెస్ట్ గా 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇవ్వడం కలకలంగా మారింది.

పాత కేసును ఫ్రెష్ గా మళ్లీ తవ్వడం చూస్తుంటే.. కావాలనే టార్గెట్ చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే అభిమానులు. గతేడాది ఆగస్టులో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్ పై ఓ కేసు నమోదైంది. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనేది ఆరోపణ. అయితే, ఆ కేసులో ఇప్పుడు నోటీసులు ఇచ్చేందుకే అన్నట్టు.. ఆ కేసును కంచన్ బాగ్ నుంచి మంగళ్ హాట్ పీఎస్ కు బదిలీ చేశారు. తాజాగా, మంగళ్ హాట్ పోలీసులు వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నోటీసులు పంపడంపై రాజకీయ చర్చ నడుస్తోంది.

Advertisement

బీజేపీలో సస్పెన్షన్ లో ఉన్న రాజాసింగ్ కు ఆ పార్టీ అధికారికంగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి బలహీన సమయాన కావాలనే రాజాసింగ్ ను కార్నర్ చేయాలని చూస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఎలాగైనా తమ నేతను మళ్లీ జైలుకు పంపించి.. ఓవైసీ కళ్లల్లో ఆనందం చూడాలనేదే ప్రభుత్వ ప్రయత్నమని రాజాసింగ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×