BigTV English

Preethi: ప్రీతిపై సైఫ్ కోపానికి కారణం ఇదే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..

Preethi: ప్రీతిపై సైఫ్ కోపానికి కారణం ఇదే.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు..

Preethi: పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి మరణం తెలంగాణను షేక్ చేసింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ.. అర్థాంతరంగా కన్నుమూసింది. చిన్నప్పటి నుంచీ డేరింగ్ అండ్ డ్యాషింగ్. అయితేనేం సీనియర్ సైఫ్ టార్చర్‌ను భరించలేకపోయింది. వాట్సాప్ గ్రూపుల్లో తనను కించపరచడాన్ని తట్టుకోలేకపోయింది. హెచ్‌వోడీకి కంప్లైంట్ చేసినా.. కౌన్సిలింగ్ ఇచ్చినా.. తనకు న్యాయం జరగట్లేదని భావించింది. బలవన్మరణానికి పాల్పడింది. ప్రీతి మరణం.. తీవ్ర కలకలం రేపింది.


నిందితుడైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. తాజాగా సైఫ్ రిమాండ్ రిపోర్టులో మరిన్ని కీలక వివరాలు నమోదు చేశారు. సైఫ్ ఫోన్‌లో మొత్తం 17 వాట్సప్ చాట్స్‌ను పరిశీలించారు పోలీసులు. అనుషా, భార్గవి, ఎల్డీడీ ప్లస్ నాకౌట్స్ అనే గ్రూప్ చాట్స్‌లో సైఫ్ పెట్టిన పోస్టులను ప్రస్తావించారు. రెండు అంశాలే సైఫ్, ప్రీతిల మధ్య తీవ్ర విభేదాలకు దారి తీశాయని గుర్తించారు.

అనస్థీషియా డిపార్ట్‌మెంట్లో ప్రీతికి సైఫ్ సూపర్‌వైజర్. ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేశాడు. ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్‌ ప్రీతిని రాయమన్నాడు. అయితే, ఆమె రాసిన రిపోర్ట్ అతనికి నచ్చలేదు. వెంటనే ఆ రిపోర్ట్‌ను వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి.. ప్రీతిని అవమానించేలా కామెంట్లు చేశాడు. రిజర్వేషన్‌లో ఫ్రీ సీటు వస్తే.. రిపోర్ట్ ఇలానే రాస్తారంటూ హేళన చేశాడు.


సైఫ్ తీరుకు ప్రీతి సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తనతో ఏమైనా ప్రాబ్లమా అంటూ సీనియర్ సైఫ్‌ను ప్రశ్నించింది. ఏదైనా సమస్య ఉంటే హెచ్‌వోడీకి చెప్పాలని.. అంతేగానీ తనపై వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి పోస్టులు పెడితే బాగుండదని సైఫ్‌ను హెచ్చరించింది.

ప్రీతి వార్నింగ్‌ను సైఫ్ తట్టుకోలేకపోయాడు. ఆమెపై మరింత కోపం పెంచుకున్నాడు. ఇకనుంచి ప్రీతిని టార్గెట్ చేయాలంటూ మిగతా సీనియర్స్‌కు సూచించాడు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని భార్గవ్ అనే సీనియర్‌కి చెప్పాడు.

సీనియర్లు తనను టార్గెట్ చేస్తున్నారనే విషయం గుర్తించిన ప్రీతి.. సైఫ్‌పై గత నెల 21న అనస్థీషియా విభాగం హెచ్‌వోడీకి కంప్లైంట్ చేసింది. అప్పటికే విషయం పెద్దది కావడంతో ప్రీతి, సైఫ్‌ను పిలిపించి.. ముగ్గురు డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన మరుసటి రోజే.. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందంటూ పోలీసులు సైఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో నమోదు చేశారు.

అంటే, కౌన్సిలింగ్‌లో ప్రీతిదే తప్పు అన్నట్టు మాట్లాడారా? డాక్టర్ల నుంచి కూడా సపోర్ట్ రాకపోవడంతోనే ప్రీతి విసుగు చెందిందా? ఇక వేస్ట్ అనుకుని.. సూసైడ్ చేసుకుందా?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×