BigTV English

RTC: ఆర్టీసీకి ‘సన్’ స్ట్రోక్.. రాబడిలో బిగ్ మైనస్..

RTC: ఆర్టీసీకి ‘సన్’ స్ట్రోక్.. రాబడిలో బిగ్ మైనస్..

RTC: ఏపీలో వర్షాలు పడుతున్నాయి కానీ.. ఇప్పటి వరకు మాడు పగిలింది. జనం సంగతి ఎలా ఉన్నా.. ఏపీఎస్‌ఆర్టీసీకి వడదెబ్బ తగిలింది. ఎండ తీవ్రతకు జనం బయటకు రాకపోవడమే అందుకు కారణం. భానుడి భగభగలతో బయటకు వెళ్లాలంటేనే జనం జడుసుకున్న పరిస్థితి. వేడి సెగలను తట్టుకోలేక ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. ఫలితంగా బస్సుల్లో సీట్లు ఖాళీ. ప్రయాణికుల సంఖ్య ఎంతలా పడిపోయిందంటే.. ఆక్యుపెన్సీ రేషియో ఏకంగా 15.47 శాతం తగ్గిపోయింది. రోజువారీ టికెట్ కలెక్షన్ ఆదాయంలో 4 కోట్ల రూపాయలకు పైగా తేడా వచ్చింది.


తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసినవాళ్లు.. సొంత వాహనాల్లో లేదంటే ఏసీ వెహికల్స్‌ను ఆశ్రయించారు. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించినట్టున్నారు. సాధారణంగా పరీక్షల సమయంలో ప్రతి ఏటా ఆక్యుపెన్సీ రేషియో తగ్గడం.. రాబడిలో కోత పడడం కామనే అయినా.. ఈసారి ఇంత పెద్ద లోటు ఉంటుందన ఊహించలేకపోయారు.

ఏపీఎస్ ఆర్టీసీ.. నిత్యం 11 వేల బస్సులు నడుపుతుండగా.. ఒక్కో బస్సుకి యావరేజ్‌గా 16 వేల 416 రూపాయల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం 13 వేల 751 మాత్రమే వస్తోంది. అంటే ఒక్కో బస్సుపై రోజూ 2 వేల 665 రాబడి తగ్గినట్టు. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో​ 61 శాతంగా ఉండేది. వాస్తవానికి 76.4 శాతం ఉండాలి. కనీసం 70 శాతమైనా వస్తుందనుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. అనుకున్న లక్ష్యం కంటే 15.47 శాతం తగ్గింది. వరుసగా రెండు నెలలుగా ఇదే పరిస్థితి కనిపించడంతో అధికారుల్లో కలవరం మొదలైంది.


గతేడాది ఆర్టీసీ వరుసగా రెండు సార్లు ఛార్జీలు పెంచడంతో టిక్కెట్ల రూపంలో రాబడి రోజుకు సగటున 18.32 కోట్లకు చేరింది. అటుఇటుగా 17 కోట్లపైనే వచ్చేది. ఏప్రిల్‌లో రోజవారీ ఆదాయం 14 కోట్లకు తగ్గిపోయింది. లక్ష్యం కంటే 4.25 కోట్ల రూపాయలు పడిపోయినట్టు. సంస్థ రాబడిలో 25 శాతం మేర ప్రతినెలా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఆదాయం తగ్గడంతో.. సర్కారుకు చెల్లించే మొత్తం కూడా తగ్గింది. ఎందుకిలా జరిగిందని ఆర్థికశాఖ ఆరా తీసినట్లు సమాచారం. పరీక్షల సమయం కావడం, పెళ్లిళ్లు, శుభకార్యాల ముహూర్తాలు లేకపోవడంతో ఆక్యుపెన్సీ రేషియో పడిపోయిందని అధికారుల సమాధానం. ఇప్పుడు ఆశలన్నీ పెళ్లిళ్ల సీజన్‌పైనే. తమ గల్లాపెట్టెకూ పెళ్లి కళ వస్తుందని అధికారుల ఆశాభావం.

ఆదాయం లోటును భర్తీ చేసేందుకు కొత్త మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. శ్రీశైలం, అరుణాచలం, తిరుపతికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×