BigTV English

Bandi Sanjay: కవిత ఫోన్లు ఇచ్చారు.. మరి, బండి సంజయ్ ఫోన్ ఇస్తారా?

Bandi Sanjay: కవిత ఫోన్లు ఇచ్చారు.. మరి, బండి సంజయ్ ఫోన్ ఇస్తారా?
kavitha bandi sanjay

Bandi Sanjay: “అంతా బండి సంజయే చేశారు.. ఆయన ఫోన్ డేటా పరిశీలిస్తే అంతా బయటకు వస్తుంది.. అడిగితే ఫోన్ లేదన్నారు.. సంజయ్ తన ఫోన్‌ను ఎందుకు దాస్తున్నారు?” అంటూ వరంగల్ సీపీ రంగనాథ్ సంచలన విషయాలు చెప్పారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ2 గా ఉన్న ప్రశాంత్‌తో కలిసి బండి సంజయ్ కుట్ర చేశారని.. అతనితో వాట్సాప్ కాల్స్ మాట్లాడారని, చాటింగ్ చేశాడని.. చెప్పారు. గుట్టంతా బండి సంజయ్ ఫోన్‌లోనే ఉందని.. ఆయన ఫోన్ ఇస్తే ఓకే.. లేదంటే వేరే మార్గాల్లోనైనా ఫోన్ డేటా సేకరిస్తామని తేల్చి చెప్పారు.


సీపీ ప్రెస్‌మీట్‌తో బండి సంజయ్ ఫోన్ చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయన ఫోన్ ఇక్కడుంది? కావాలనే ఫోన్ లేదని చెప్పారా? ఉంటే ఇవ్వొచ్చుగా? తానేమీ తప్పు చేయకపోతే.. పోలీసులకు ఫోన్ ఇస్తే ప్రాబ్లమ్ ఏంటి? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత విషయంలోనూ ఇలానే జరిగింది. లిక్కర్ స్కాం బయటకు వచ్చాక.. ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు మార్చారని ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది. ఆ ఫోన్లను ధ్వంసం చేశారంటూ లీకులు కూడా ఇచ్చింది. ఇక, కవిత విచారణ సందర్భంగా ఆ పది ఫోన్లు ఏవంటూ ఈడీ అధికారులు అడగడం.. మర్నాడు ఈడీ ఆఫీసుకు వస్తూ.. తన 10 ఫోన్లు ఇవేనంటూ కవిత బహిరంగంగా మీడియాకు చూపించడం ఆసక్తికరంగా మారింది.


కవిత తన రెండు చేతులతో.. ప్లాస్టిక్ కవర్లలో ఉంచిన ఫోన్లను మీడియాకు చూపించే విజువల్ అప్పట్లో ఫుల్ వైరల్ అయింది. తానేమీ తప్పు చేయలేదనే కాన్ఫిడెన్స్ ఆమె చేష్టల్లో కనిపించింది. తన ఫోన్లు తన దగ్గరే ఉన్నాయని.. వాటిని ధ్వంసం చేసినట్టు ఈడీ ఫేక్ లీక్‌లు ఇచ్చిందంటూ రివర్స్ అటాక్ కూడా చేశారు కవిత. ఒక మహిళ నుంచి ఫోన్లు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నిలదీశారు. ఈడీకి తన ఫోన్లను స్వాధీనం చేసి కేసు విచారణకు సహకరించారు కవిత. ఆ తర్వాత కొన్నిరోజులకు కవిత తరఫు లాయర్ల సమక్షంలో ఆమె ఫోన్ డేటాను పరిశీలించారు ఈడీ అధికారులు.

ఇప్పుడు కవిత తీరును.. బండి సంజయ్ వైఖరిని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కామెంట్స్ ఫైట్ చేస్తున్నారు. కవిత తప్పు చేయలేదు కాబట్టి తన 10 ఫోన్లు ఈడీకి ఇచ్చేశారని.. అదే బండి సంజయ్ తప్పు చేశారు కాబట్టి తన ఒక్క ఫోన్ కూడా పోలీసులకు ఇవ్వలేదని విమర్శలకు దిగుతున్నారు బీఆరెస్ సపోర్టర్స్. మంత్రి ఎర్రబెల్లి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బండి సంజయ్ ఫోన్ ఇస్తే.. కేంద్రం కుట్రలన్నీ బయటపడతాయనే భయమా? అని ప్రశ్నించారు. టెన్త్ పేపర్ లీక్ వెనుక మోదీ హస్తం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఎర్రబెల్లి.

ఒక్క ఫోన్.. బండి సంజయ్‌కి, బీజేపీకి బాగానే డ్యామేజ్ చేసేలా ఉందంటున్నారు. ఇస్తే ఓ ప్రాబ్లమ్.. ఇవ్వకపోతే ఇంకో ప్రాబ్లమ్. ఎలా చూసినా బండికి బ్యాండేనా?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×