E-Paper
Advertisement

48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
Advertisement

Ponnam Prabhakar: తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకుంటే కేవలం 48 గంటల వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు.

ఇళ్ల పట్టాల పంపిణీ.. లబ్ధిదారుల్లో ఆనందం

Advertisement

నాంపల్లి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పట్టాలను పంపిణీ చేశారు. మొత్తం 361 మంది లబ్ధిదారులకు ఈ ఇళ్ల పట్టాలను అందజేశారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు.

లక్ష ఇందిరమ్మ ఇళ్లు.. సన్నబియ్యం పంపిణీ

Advertisement

పేదల సంక్షేమమే ధ్యేయంగా మరికొన్ని భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టబోతోందని మంత్రి వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తామని ప్రకటించారు. దీనితో పాటు, రేషన్ కార్డు దారులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

Also Read: చేయూత పెన్షన్ల ప్రక్షాళన.. 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు!

ఒంటరి మహిళలకు పెన్షన్ల భరోసా

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన, ఆసరా లేని ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని మంత్రి తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సాయం అందుతుందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×