BigTV English

Prajavani Effect : ప్రజావాణి ఎఫెక్ట్‌.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం..

Prajavani Effect : ప్రజావాణి ఎఫెక్ట్‌.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం..
TS TODAY NEWS

Prajavani Effect(TS today news):

ప్రజావాణి ఎఫెక్ట్‌తో ఓ కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం స్థానికత కారణం చూపుతూ రెండు ఏళ్లుగా కాలాయాపన చేయడంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, తమ సమస్యను విన్నవించుకుంది బాధిత మహిళ.


అంబర్ పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శేఖర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ 2021లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఉద్యోగం కోసం గత ప్రభుత్వానికి కానిస్టేబుల్‌ భార్య సత్యలత అర్జీ సమర్పించింది. సత్యలత ఏపీకి చెందిన మహిళ కావడంతో.. స్థానికత అంశం సాకుగా చూపించి గత ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు.

ప్రజావాణి కార్యక్రమంలో ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చింది సత్యలత. వారి సమస్య విన్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి సత్యలతకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. సత్యలతకు రాచకొండ కమిషనరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ రాచకొండ సీపీ సుధీర్‌బాబు నియామకపత్రం అందజేశారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×