BigTV English

Droupadi Murmu : భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. రామయ్య సేవలో ద్రౌపదీ ముర్ము..

Droupadi Murmu : భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. రామయ్య సేవలో ద్రౌపదీ ముర్ము..

Droupadi Murmu : భద్రాద్రి ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్మ సందర్శించారు. రాములోరికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలుత హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో భద్రాచలం వచ్చారు. భద్రాద్రిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు.


అనంతరం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అర్చకులు, దేవాదాయశాఖ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ద్రౌపదీ ముర్ము దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతికి అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భద్రాద్రి ఆలయంలో ప్రసాద పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. వనవాసీ కళ్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క – సారాలమ్మ జన్‌జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచే కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్‌గా ప్రారంభించారు.

భద్రాచలం పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనం అందించారు. రాష్ట్రపతి కోసం 15 రకాల శాకాహార వంటలను సిద్ధం చేశారు. ఉల్లిపాయ, చామగడ్డ, చింతపండు, అనపకాయలు ఉపయోగించకుండా చెఫ్‌లకు ప్రత్యేక వంటకాలు తయారు చేశారు.  


రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ కాన్వాయ్‌ గోదావరి వంతెనపై కనిపించింది. రాష్ట్రపతితోపాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వందకుపైగా వాహనాలతో కూడిన అతి భారీ కాన్వాయ్‌ భద్రాచలం చేరుకున్నారు. ఆలయ తూర్పు ముఖద్వారం వరకు రాష్ట్రపతి, ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది వాహనాలకే అనుమతి ఇచ్చారు. మిగిలిన వీఐపీల వాహనాలను మిథిలా స్టేడియం వరకే అనుమతించారు.

రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు. మొత్తం ఐదురోజులపాటు ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 30 వరకు తెలంగాణలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×