
Vaarasudu Trailer:కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 12న వారసుడు సినిమా రిలీజ్ కానుంది. సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో వారసుడు సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. వారసుడు సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే సమాచారం.
అది కూడా చిత్ర యూనిట్ ఇవ్వలేదు. ఓ తమిళ ఇంటర్వ్యూలో కిక్ శ్యామ్ మాట్లాడుతూ వారసుడు ట్రైలర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. దాని ప్రకారం జనవరి 1న విజయ్ .. వారసుడు సినిమా ట్రైలర్ విడుదల కానుంది. తన అభిమానుల కోసం దళపతి విజయ్ న్యూ ఇయర్ ట్రీట్‌ను సిద్ధం చేశాడనేగా అర్థం. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఎమోషన్స్ కలగలిసిన ఎంటర్‌టైనర్‌గా వారసుడు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం ఆడియో రిలీజ్ రీసెంట్‌గానే చెన్నైలో జరిగింది. తమిళంలో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ హై రేంజ్‌లో ఉన్నాయి. దిల్ రాజు తెలుగులోనూ వారసుడు సినిమాను భారీ రేంజ్‌లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ వీరసింహా రెడ్డి, అజిత్ తెగింపు చిత్రాలు సహా రెండు చిన్న చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. మరి ఈ భారీ పోటీలో వారసుడు ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.