Rajagopalreddy : కౌరవ సైన్యం మొత్తం మునుగోడుకు వచ్చి అధర్మ యుద్ధంతో టీఆర్ఎస్ గెలిచిందంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది జస్ట్ నెంబర్ గేమ్ మాత్రమేనని.. గట్టి పోటీ ఇచ్చి నైతికంగా తానే గెలిచానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బు, అధికారంతో.. అక్రమాలు, ప్రలోభాలతో విజయం సాధించారని విమర్శించారు.
మునుగోడు నియోజకవర్గంలో ఊరూరా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించి.. డబ్బు, మద్యం ఏరులై పారించి ఓటర్లను ప్రలోభపెట్టారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈసీ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి.. టీఆర్ఎస్ కు కొమ్ము కాసారని అన్నారు. తనను ఓడించేందుకు మొత్తం అసెంబ్లీ కదిలివచ్చిందన్నారు. టీఆర్ఎస్ దుర్మార్గంగా గెలిచిందని.. తాను ప్రజల మనుసులో ఉన్నానన్నారు రాజగోపాల్ రెడ్డి.