E-Paper
Advertisement

Worldcups : సౌతాఫ్రికాకు కలిసిరాని వరల్డ్ కప్ లు..

Worldcups : సౌతాఫ్రికాకు కలిసిరాని వరల్డ్ కప్ లు..

Worldcups : ఈ ఏడాది T20 వరల్డ్ కప్పే కాదు… గతంలో ఏ ఐసీసీ టోర్నీ కూడా సౌతాఫ్రికాకు కలిసి రాలేదు. అటు వన్డే వరల్డ్ కప్ లోగానీ, ఇటు T20 వరల్డ్ కప్ లో గానీ ఆ జట్టు ఎప్పుడూ సెమీస్ దాటలేదు. ప్రతీసారి బలమైన జట్టుగా, ఫేవరెట్ గా బరిలోకి దిగడం… లీగ్ దశలోనో, నాకౌట్ లోనో ఒట్టి చేతులతో ఇంటిబాట పట్టడం సౌతాఫ్రికాకు అలవాటే.

50 ఏళ్ల కిందటే ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో దక్షిణాఫ్రికా చాలా బలమైన జట్టు. కానీ వర్ణ వివక్ష కారణంగా 1970లో ఆ జట్టుపై ఐసీసీ నిషేధం విధించింది. తిరిగి ఆ నిషేధాన్ని 1991లో ఎత్తివేయడంతో… అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. పునరాగమనం తర్వాత గత 31 ఏళ్లుగా… గొప్ప బ్యాటర్లు, గొప్ప బౌలర్లతో సౌతాఫ్రికా ఎప్పుడూ బలమైన జట్టుగానే ఉంది. కాకపోతే… మెగా టోర్నీల్లో ప్రతీసారీ ఒత్తిడికి లోనై… పరాభవంతో వెనుదిరుగుతోంది. 1992 నుంచి ఇప్పటిదాకా జరిగిన 8 వన్డే వరల్డ్ కప్ ల్లో 4 సార్లు… 8 T20 వరల్డ్ కప్ ల్లో 2 సార్లు మాత్రమే సౌతాఫ్రికా సెమీస్ వరకు చేరింది. ఆ ఆరుసార్లూ ఫైనల్ చేరలేదు. సౌతాఫ్రికాను దురదృష్టం వెంటాడిన వరల్డ్ కప్ అంటే… 1999 వన్డే వరల్డ్ కప్ గురించి చెప్పుకోవాలి. ఆ వరల్డ్ కప్ లో సెమీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ డ్రా అయినా… లీగ్ దశలో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచిందన్న కారణంతో… అప్పుడున్న నిబంధనల మేరకు ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఆ తర్వాత కూడా సఫారీల వైపు అదృష్టం ఎన్నడూ లేదు. ఏయే వరల్డ్ కప్ ల్లో సౌతాఫ్రికా ఎప్పుడు ఇంటిదారి పట్టిందో చూద్దాం…

1992 వరల్డ్ కప్ : సెమీస్ లో ఇంగ్లాండ్ చేతి ఓటమి
1996 వరల్డ్ కప్ : క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓటమి
1999 వరల్డ్ కప్ : సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
2003 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్
2007 వరల్డ్ కప్ : సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
2011 వరల్డ్ కప్ : క్వార్టర్స్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి
2015 వరల్డ్ కప్ : న్యూజిలాండ్ చేతిలో సెమీస్ లో ఓటమి
2019 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్

2007 T20 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్
2009 T20 వరల్డ్ కప్ : సెమీస్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమి
2010 T20 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్
2012 T20 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్
2014 T20 వరల్డ్ కప్ : సెమీస్ లో ఇండియా చేతిలో ఓటమి
2016 T20 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్
2021 T20 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్
2022 T20 వరల్డ్ కప్ : లీగ్ దశలోనే ఔట్

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×