Sandeep Reddy Vanga: ఒక కథను బలంగా నమ్మి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక ఆలోచనను నమ్మి నిర్మాత డబ్బులు పెట్టడం అంటే సాహసం అని చెప్పాలి. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సందీప్ రెడ్డి వంగ ఎంట్రీ ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు. ఒక సందర్భంలో ప్రొడ్యూసర్ కథ వినడానికి వచ్చి కూడా డైరెక్టర్ వచ్చే టైం కి వెళ్లిపోయాడు. అలా సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ రావడానికి అంటే ముందు లైఫ్ లో ఎంతో ట్రాజడీ జరిగింది. అర్జున్ రెడ్డి సినిమాను వైజయంతి బ్యానర్ పై స్వప్న కూడా నిర్మించే ఆలోచన పెట్టుకున్నారు. అప్పుడు శర్వానంద్ హీరోగా కూడా అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు. మొత్తానికి సందీప్ రెడ్డి వంగ అన్నయ్య ప్రణయ్ రెడ్డి వంగ ప్రొడ్యూసర్ గా అర్జున్ రెడ్డి సినిమాను మొదలుపెట్టి, ఫినిష్ చేసి సక్సెస్ కూడా కొట్టారు.
అర్జున్ రెడ్డి ఒక సంచలనం
అర్జున్ రెడ్డి సినిమా టీజర్ విడుదలైనప్పుడే చాలా కాంట్రవర్సీ కి దారి తీసింది. చాలామంది ఆ టీజర్ ను డైరెక్ట్ గా టీవీలో వేసి చూపించారు. కొంతమంది సెన్సార్ వాళ్లు టీవీకి పర్మిషన్ ఎందుకు ఇచ్చేవాన్ని సందీప్ రెడ్డి వంగని అడిగినప్పుడు. నేనెవరికీ పర్మిషన్ ఇవ్వలేదు వాళ్లే వేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. అప్పట్లో సెన్సార్ బోర్డు పైన కూడా సందీప్ రెడ్డివంగా సెటైర్లు వేశారు. వైవా రూమ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా.? ఒకరిని టార్గెట్ చేస్తారు, ఈ సంవత్సరం లేపేద్దామని ఫిక్స్ అవుతారు. అలానే సెన్సార్ బోర్డు కూడా నన్ను టార్గెట్ చేశారంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలమైన హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలు కొన్ని సీన్స్ విపరీతంగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. అన్నిటికీ మించి అర్జున్ రెడ్డి ఓపెనింగ్ సీన్లు ప్యాంట్ లో ఐస్ గడ్డలు వేసుకోవటం.
Also Read : Mehar Ramesh : అన్ని ప్రభాస్ చేశాడు, ఒక్క షాట్ కూడా డూప్ లేదు
ప్యాంట్ లో ఐస్ క్యూబ్ లు ఎందుకు
అర్జున్ రెడ్డి సినిమా ఓపెన్ చేయగానే ఒక టెర్రస్ పైన విజయ్ దేవరకొండ మిగిలిపోయిన మందు తాగుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో తన పేషంట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అనుకున్న పని జరగకపోవడంతో నిరాశతో బయటికి వచ్చి ఫ్రస్ట్రేషన్ లో ఏం చేయాలో తెలియక పక్కనే చెరుకు బండి దగ్గర ఉన్న కొన్ని ఐసు గడ్డలు తీసుకొని తన ప్యాంట్ లో వేసుకుంటాడు. అయితే ఈ సీన్ కి సందీప్ రెడ్డి వంగ ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చాడు. మనం చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ ఉంటాం కొన్నిసార్లు చైన్ ఊడిపోతూ ఉంటుంది. మనం చాలా సేపు ప్రయత్నించి అది జరగట్లేదు అని చెప్పి సైకిల్ను పక్కకు తన్నేస్తుంటాం. అచ్చం ఈసీను కూడా అలాంటిదే చాలాసార్లు ట్రై చేసిన తర్వాత ఫ్రస్టేషన్లో ఏం చేయాలో తెలియక అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంటూ సందీప్ రెడ్డివంగా తెలిపాడు.
Also Read : Vankkantham Vamsi: నా పేరు సూర్య సినిమా ప్లాప్ అయిన తర్వాత అరవింద్ గారి పిలిచి ఏం చెప్పారంటే.?