BigTV English

Hyderabad : హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచారం.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్..

Hyderabad : హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచారం.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్..

Hyderabad : సోషల్ సర్వీస్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కలరింగ్. కానీ అసలు చేసేది దగుల్భాజీ వ్యాపారం. అఖిల్ పహిల్వాన్ అనే పేరు హైదరాబాద్‌లో తెలియని వారు ఉండరు. బోనాల జాతర సందర్భంగా ఇతడు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తొట్టెల ఊరేగింపు అప్పుడు బుల్లితెర నటులను పిలిచి హడావిడి చేస్తుంటాడు.


తాజాగా ఈ పహిల్వాన్ ఆధ్వర్యంలోనే జరుగుతున్న గలీజు దందా వెలుగు చూసింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్ అబిడ్స్‌లో పక్క సమాచారంతో తనిఖీలు చేయగా.. ఫార్ట్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠా బయటపడింది. పోలీసులు ఈ కేసులో లోతైన విచారణ జరపగా.. అఖిల్ పహిల్వాన్ పేరు తెరపైకి వచ్చింది. రామ్‌నగర్ అఖిల్ పహిల్వాన్ నేతృత్వంలో ఈ వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ ​పహిల్వాన్ ​తన స్నేహితుడైన రఘుపతితో కలిసి కొంతకాలంగా హైదరాబాద్‌లో సెక్స్​రాకెట్​ నడుపుతున్నారు. వెస్ట్​బెంగాల్‌కు చెందిన నిరుపేద కుటుంబాల్లోని యువతులను సామాజిక మాద్యమాల​ ద్వారా సంప్రదించి హైదరాబాద్ ​వచ్చి తాము చెప్పినట్టుగా చేస్తే రోజుకు 15 నుంచి 25వేల రూపాయలు సంపాదించుకోవచ్చని ఉచ్ఛులోకి లాగేవాడు. బస, ఇతరత్రా ఏర్పాట్లు తామే చేస్తామని చెప్పేవారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వెస్ట్ బెంగాల్ ​నుంచి 16 మంది యువతులు హైదరాబాద్​ వచ్చారు.


యువతులను అఖిల్ ​పహిల్వాన్ అబిడ్స్‌‌లోని ఫార్ట్యూన్​ లాడ్జీలో బస చేయించాడు. లాడ్జీలో 25 గదులు ఉండగా 16 గదులను అఖిల్​పహిల్వాన్ ఎలాంటి ఆధార పత్రాలు లేకుండానే బుక్ చేశాడు. లాడ్జీలో దిగిన యువతుల వద్దకు అఖిల్​పహిల్వాన్​ అతని సహచరుడు రఘుపతి కస్టమర్లను పంపిస్తూ వ్యభిచారం జరిపిస్తున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారం అందటంతో లాడ్జీపై దాడి నిర్వహించిన పోలీసులు 16 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఓ యువతి ముంబాయి నుంచి ఇక్కడికి వచ్చిందని విచరణలో తెలింది. విచారణలో వీళ్లు వెల్లడించిన వివరాల ద్వారా పోలీసులు ఈ రాకెట్​ నడుపుతున్న అఖిల్ ​పహిల్వాన్, రఘుపతిలను అరెస్టు చేశారు. దాంతోపాటు కస్టమర్లయిన అభిషేక్​భాటి, కేశవ్​వ్యాస్, అబ్దుల్​ఖలీద్, సంతోష్‌లను కూడా అరెస్టు చేశారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న 16 మంది యువతులను రిహాబిలేషన్​ సెంటర్‌కు తరలించారు. నిందితుల నుంచి 22 సెల్​ఫోన్లు సీజ్ ​చేశామన్నారు.

అఖిల్​పహిల్వాన్​ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్​ ఫోన్‌లోని వివరాలను విశ్లేషించగా టాలీవుడ్, బుల్లితెరకు చెందిన పలువురు నటీనటుల నెంబర్లు ఉన్నట్లుగా నిర్ధారణ​ అయ్యింది. దాంతోపాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు యువతుల ఫోన్​ నెంబర్లు కూడా ఉన్నట్లు తేలింది. అఖిల్​పహిల్వాన్​ టాలీవుడ్, బుల్లితెరకు చెందిన వారికి కూడా యువతులను సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై అబిడ్స్ ​ఇన్స్​పెక్టర్​ నర్సింహ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో అఖిల్​పహిల్వాన్ ​టాలీవుడ్, బుల్లితెర నటులకు అమ్మాయిలను సప్లై చేసినట్టుగా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదన్నారు. అయితే, అతని సెల్​ఫోన్లో పలువురు సెలబ్రెటీల నెంబర్లు ఉన్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో వెలుగు చూసిన సెక్స్​రాకెట్‌తో ఎవరైనా నటులకు సంబంధాలు ఉన్నాయా? అఖిల్​పహిల్వాన్​ ద్వారా ఎవరైనా నటులు యువతులను పిలిపించుకున్నారా? అన్న కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×