E-Paper
Advertisement

Ration Rice Scam: పైసలు కొట్టు.. బియ్యం పట్టు.. జోగులాంబ గద్వాల జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా..!

Ration Rice Scam: పైసలు కొట్టు.. బియ్యం పట్టు.. జోగులాంబ గద్వాల జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా..!
Advertisement

Ration Rice Scam: స్వేఛ్చ బ్యోరో: జోగులాంబ జిల్లాలో రేషన్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న సన్నబియ్యాన్ని కొందరు డీలర్లు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాలలో 355 రేషన్ దుకాణాలు ఉండగా 1,85,658 రేషన్ కార్డుదారులు ఉన్నారు. గ్రామీణ స్థాయిలో పేద మద్దతు వర్గాలు బియ్యంతోపాటు ఇతర వస్తువులు తీసుకుంటుండగా, పట్టణాలలో ఉంటున్న రేషన్ కార్డుదారులు దుకాణాల నుంచి బియ్యం తీసుకెళ్లడానికి ఆసక్తి చూపకపోవడాన్ని డీలర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

డీలర్ల చేతివాటం

గద్వాల పట్టణంలోని ఓ రేషన్ దుకాణంలో సన్నబియ్యానికి బదులుగా నగదు ఇస్తుండడం బహిరంగంగానే సాగుతోంది. కిలో బియ్యానికి బదులు రూ.10 నుంచి 15 చొప్పున లబ్ధిదారులకు చెల్లించి ఆ రైస్ ను హోటళ్లకు, ఇతర వ్యాపారులకు కిలో 25 నుంచి 30 వరకు అమ్ముకుంటున్నారు. మరికొందరు బియ్యాన్ని గోదాంలో భద్రపరిచి అక్రమంగాసమీపంలోని కర్ణాటకకు తరలిస్తున్నారు.

Advertisement

Also Read: BIG TV Chairman Vijay: తెలుగులో ఆదరించినట్లు మలయాళీలు ఆదరిస్తారని కోరుకుంటున్నా!

బియ్యం లో పోషకాలు ఉన్నా

ప్రభుత్వం ప్రజల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు సాధారణ బియ్యంతో పాటు ఫోర్టీఫైడ్ రైస్ (పోషక విలువలు గల బియ్యం) కలిపి పంపిణీ చేస్తోంది. ప్రతి క్వింటాళ్లు బియ్యం లో కిలో ఫోర్టిఫైడ్ రైస్ కలుపుతారు. వీటిలో ఐరన్, బి కాంప్లెక్స్ ,ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు మెండుగా ఉంటాయి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించిన అనంతరం రైస్ మిల్లులో మర ఆడించి సంబంధిత స్టాక్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరాచేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. ఇందుకోసం రూ.38 వరకు ఖర్చు అవుతుంది. బహిరంగ మార్కెట్ లో పోషకాల బియ్యానికి రూ.60 వరకు ఉంటుంది. ఇది తెలియక లబ్ధిదారులు వరి సాగు చేసే రైతుల దగ్గర బియ్యాన్ని కొనుగోలు చేస్తూ రేషన్ కార్డుదారులు రేషన్ దుకాణాల నుంచి పొందాల్సిన బియ్యాన్ని 10 నుంచి 15 కు విక్రయిస్తున్నారు.

దుకాణాల్లోనే చెల్లిస్తూ..

Advertisement

గద్వాలలో రేషన్ బియ్యం కోసం ఓ యజమాని రేషన్ దుకాణానికి వెళ్ళాడు. డీలర్ కు రేషన్ కార్డ్ నెంబర్ చెప్పి ఈ పాస్ యంత్రంపై తన వేలిముద్ర వేశాడు. ఆ కార్డులో ఐదుగురు కుటుంబ సభ్యులు పేర్లు నమోదు ఉండడంతో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 30 కిలోల బియ్యాన్ని ఇవ్వాలి. ఆ రేషన్ కార్డ్ దారుడు బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వమని చెప్పగా 15 చొప్పున లెక్క పెట్టి చేతిలో పెట్టాడు. ఇలా చాలా రేషన్ దుకాణాల్లో ఇదే తంతు నడుస్తోంది. మరికొందరు రేషన్ కార్డు దారులు ఇంటి దగ్గర ఉండి సమీప రేషన్ షాప్ డీలర్ కు ఫోన్ చేసి ఓటిపి చెప్పడం ద్వారా నేరుగా వారికి ఫోన్ పే చెల్లిస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు గారుస్తున్నారు. జిల్లాలో వివిధ గ్రామాల నుంచి దళారులు లబ్ధిదారుల నుండి సేకరించిన రేషన్ బియ్యాన్ని బోలేరాలలో రాయచూర్ కు తరలిస్తుండగా ధరూరు, కేటి దొడ్డి మండలాలలో తరచుగా పోలీసులకు పట్టుబడుతున్నాయి. తరచుగా పట్టుబడ్డ వారిపై కేసులు నమోదవుతున్నా ఆ దందాకు అలవాటు పడ్డవారు దర్జాగా దందాను కొనసాగిస్తున్నారు.

Also Read: KTR: ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రే.. ఇదంతా ఒక నాటకం: కేటీఆర్

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×