Big Stories

Khammam: ఖమ్మం సభ బీఆర్ఎస్ కోసమా? పొంగులేటి కోసమా? కేసీఆర్ స్కెచ్ ఏంటి?

Khammam: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించే సభ. బీఆర్ఎస్ సత్తాను దేశానికి చూపించే సభ. 5 లక్షల మందితో ఖమ్మం గర్జన ఢిల్లీకి వినిపించేలా ప్లాన్ చేస్తున్న సభ. అందుకే, ఖమ్మం బహిరంగ సభపై కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి ఛాలెంజింగ్ సభలు నిర్వహించారు కేసీఆర్. ఆ తర్వాత, ఆ స్థాయిలో ఉనికి చాటేందుకు చేపట్టిన ఖమ్మం సభపై గులాబీ బాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

- Advertisement -

కీలకమైన సభకు.. ఖమ్మంను ఎంచుకోవడమే అత్యంత ఆసక్తికరం. ఓవైపు పొంగులేటి, మరోవైపు తుమ్మల.. పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న జిల్లాలో.. అది కూడా పార్టీకి అంతగా పట్టులేని ఖమ్మంలో.. అంతపెద్ద బహిరంగ సభను ప్లాన్ చేసి కేసీఆర్ సాహసమే చేశారంటున్నారు. ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జనాలను ఖమ్మంకు తరలిస్తారనుకోండి అది వేరే విషయం. 5 లక్షల అన్నదగ్గర ఏ లక్షో, రెండు లక్షల మందినో పక్కాగా తీసుకొస్తారనడంలో సందేహం అవసరం లేదు.

- Advertisement -

ఖమ్మం సభ కీలకం ాకవడంతో కేసీఆరే నేరుగా సభా ఏర్పాట్లను చూస్తున్నారు. మంత్రి హరీష్ రావును పైలెట్ గా పెట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే భారీగా జనసమీకరణ చేయాలని చూస్తున్నారు. అయితే, ఖమ్మం నేతలు వర్గాలుగా చీలిపోవడం.. మాజీ ఎంపీ పొంగులేటి ఏకంగా రెబెల్ జెండా ఎగరేయడం.. తుమ్మల టచ్ మీ నాట్ లా ఉంటుండటంతో.. గులాబీ బాస్ లో కాస్త గుబులు పెరిగింది. ఒకవేళ ఖమ్మం సభ ఫ్లాప్ అయితే..? ఆ ఆలోచనే ఆయన ఉలిక్కిపడేలా చేస్తోంది. అందుకే, అవసరం కోసం కాస్త తగ్గైనా.. నెగ్గాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. అందుకే, మంత్రి హరీష్ రావును.. ఖమ్మంలో కీలక నేతైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి పంపించారు. తుమ్మలతో కాళ్ల బేరానికి వచ్చారో.. లేదంటే మనం మనం పాత కాపులమంటూ మచ్చిగ చేసుకున్నారో.. లోలోన ఏం జరిగిందో కానీ.. బయటకు అంతా హ్యామీ. కట్ చేస్తే.. గురువారం కేసీఆర్ పర్యటనలో ఆయన పక్కనే తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యక్షమవడం ఆసక్తికరం. తుమ్మల సైతం బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుండగా.. ఆయనేమీ ఈయన పక్కన కనిపించడంతో రాజకీయ విశ్లేషకులకు పని పెరిగింది.

రెండోసారి సీఎంగా అయినప్పటి నుంచీ తుమ్మలను అస్సలు పట్టించుకోలేదు కేసీఆర్. అంతపెద్ద సీనియర్ నేతకు కనీస ప్రాధాన్యం కూడా దక్కలేదు. ఏ సమావేశాలకు ఆహ్వానాలు లేవు. ప్రగతిభవన్ లోకి ఎంట్రీ లేదు. అలా, నాలుగేళ్లుగా తుమ్మలను ఓ మూలకు పరిమితం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఖమ్మం సభ ఉందని.. ఆయన్ను ఆలింగనం చేసుకోవడం చూసి.. ఔరా కేసీఆర్.. అనుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మంలో తుమ్మల బలమైన నేత. సగం జిల్లాను ప్రభావితం చేయగల నాయకుడు. ఆయన సహకారం లేనిదే.. ఖమ్మం సభ సక్సెస్ కావడం కష్టమే. ఈ విషయం గుర్తించే కేసీఆర్.. హరీష్ ను పంపించి తుమ్మలతో రాజీ కుదిర్చారని అంటున్నారు.

తుమ్మల సరే.. మరి, పొంగులేటి? సవాలే లే. పొంగులేటి విషయంలో కేసీఆర్ తగ్గేదేలే అన్నట్టు ఉంటున్నారు. తుమ్మల అంటే ఆయన ఏనాడు పార్టీకి, అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ, పొంగులేటి అలా కాదు. ఇటీవలి ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ అండ్ కో పై ఘాటైన విమర్శలు చేశారు. అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని అవినీతికి పాల్పడుతున్నారని.. అంతకుఅంతా అనుభవిస్తారంటూ.. శాపనార్థాలు కూడా పెట్టారు. త్వరలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పొంగులేటి ఎలాగూ పోయేవాడే.. ఇక ఆయన్ను ఆపడం వేస్ట్ అనేది కేసీఆర్ లెక్క. ఖమ్మంలో గ్రాండ్ సభ నిర్వహించి.. పొంగులేటికి, పరోక్షంగా బీజేపీకి షాక్ ఇవ్వాలనేదే కేసీఆర్ వ్యూహం. పొంగులేటి బాటలో మరికొందరు పార్టీని వీడి వెళ్లకుండా.. అలాంటి ఆలోచన ఉన్నవాళ్లంతా డిఫెన్స్ లో పడేలా.. ఖమ్మం సభ సక్సెస్ చేయాలనేది కేసీఆర్ స్కెచ్. అందుకే, కావాలనే అంతగా బలం లేకపోయినా.. భారీ బహిరంగ సభకు ఖమ్మంను వేదికగా ఎంచుకున్నారని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News