Big Stories

IPS: భారీగా ఐపీఎస్‌ల బదిలీలు అందుకేనా?.. సమయం లేదు మిత్రమా..!!

IPS: ఎన్నికల నిర్వహణకు ఈసీ తరఫున కొన్ని కచ్చితమైన నిబంధనలు ఉంటాయి. అందులో ఒకటి.. దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న పోలీస్ అధికారులను వెంటనే బదిలీ చేయడం. మొదట్లో ఈ రూల్ గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ, ఎలక్షన్ సమయంలో ఖాకీలు అధికారపార్టీతో అంటకాగడం ఎక్కువవడంతో.. ఈసీ చాలా స్ట్రిక్ట్ గా ట్రాన్స్ ఫర్స్ చేస్తోంది. అందుకు విరుగుడుగా.. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎన్నికలకు ముందు పోలీస్ అధికారులను బదిలీ చేస్తున్నారు. తమకు కావలసిన వారిని, కావలసిన పోస్టులో, కావలసిన చోట నియమిస్తున్నారు.

- Advertisement -

లేటెస్ట్ గా తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఒకేసారి సుమారు 60 మంది ఐపీఎస్ లను అటూఇటూ మార్చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ట్రాన్స్ ఫర్స్ చూసి.. ఖాకీలే అవాక్కయ్యారు. ఇన్నాళ్లూ వెయిటింగ్ లో ఉన్న చాలా మంది ఐపీఎస్ లకు తాజా బదిలీల్లో పోస్టింగులు వచ్చాయి. ఎస్పీ స్థాయి నుంచి ఐజీ లెవెల్ వరకు ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. కరీంనగర్, రామగుండం సీపీలు.. నల్లగొండ, మహబూబ్ నగర్, వనపర్తి, సిరిసిల్లల ఎస్పీలు ట్రాన్స్ ఫర్ అయ్యారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మెజార్టీ డీసీపీలు బదిలీ అయ్యారు.

- Advertisement -

ఇదంతా చూస్తుంటే.. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రిపరేషన్ లో గట్టి కసరత్తే చేస్తున్నారని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరికల్లా ఎలక్షన్ జరగాల్సిందే. ముందస్తుకు వెళితే మరింత ముందుగానే ఎన్నికలు రావొచ్చు. అందుకు రెడీ ఉండేలా.. తాజా పోలీస్ బదిలీలు జరిగాయని అంటున్నారు. ఇటీవల టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనకా ఎలక్షన్ సిగ్నల్స్ ఉన్నాయంటున్నారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవం, అమరుల స్మారకం, కంటివెలుగు పథకం.. ఇవన్నీ ఓట్ల పండగ కోసమేననే చర్చ నడుస్తోంది.

అయితే, కేసీఆర్ ఈసారి కూడా ముందస్తుకు వెళితే.. మళ్లీ ప్రతిపక్షాలకు ఝలక్ తప్పలే లేదు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు రెడీగా లేదు. ఇప్పుడిప్పుడే కమిటీలు, సమావేశాలు, మిషన్లతో ఎలక్షన్ల దిశగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ మాత్రం విపక్షం కంటే ఎంతో ముందుచూపుతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. గతంలోలానే ఈసారి కూడా గులాబీ బాస్ ముందస్తు బాంబ్ పేల్చితే..? అపొజిషన్ ఆగమాగమేనా? సమయం లేదు ప్రతిపక్షమా…..!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News