BigTV English

AP-Telangana: యూరియా కొరతకు బ్రేక్.. ఫలించిన ఒత్తిడి, తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆనందం

AP-Telangana: యూరియా కొరతకు బ్రేక్.. ఫలించిన ఒత్తిడి, తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆనందం

AP-Telangana:  తెలంగాణలో యూరియా కొరత ఆందోళనకు ఫుల్‌స్టాప్ పడినట్టేనా? అన్నదాతల్లో ఆనందం మొదలైందా? యూరియా ప్రకంపనలు తెలంగాణను కుదిపేశాయా? ఈ క్రెడిట్ మాదంటే మాదని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయా? ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు.


అంతర్జాతీయ సమస్య నేపథ్యంలో దేశంలో యూరియా కొరత మొదలైంది. సరిపడినంత యూరియా లేక అన్నదాతలు వ్యవసాయ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిరసన చేపట్టారు.. అందులో కొన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు ఉన్నారనుకోండి. అది వేరే విషయం.

ఈ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీ-బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పరిస్థితి గమనించిన కేంద్రం, ఈ నేపథ్యంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రప్రభుత్వం.


బీహార్‌కు 2,700 యూరియా, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100 యూరియా ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయించింది. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆయా రాష్ట్రాల రైతులకు ఉపశమనం లభించింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ఒత్తిడితో తెలుగు రాష్ట్రాలకు యూరియా కేటాయించింది.

ALSO READ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ జిల్లాల్లో కుండపోత వానలు

యూరియా కొరత ఏపీ కంటే తెలంగాణను రాజకీయంగా బాగా కుదిపేసింది. విపక్ష బీఆర్ఎస్ ఓ అగుడు ముందుకేసి అధికార పార్టీపై విరుచుకుపడింది. కానీ అసలు విషయం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పినా బీఆర్ఎస్ పార్టీ వినలేదు. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల యూరియా కొరత ఏర్పడిందన్నారు. పొలిటికల్ మైలేజీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసింది బీఆర్ఎస్.

అధికార కాంగ్రెస్ పార్టీ-బీజేపీ ఒత్తిడి ఫలించిందని అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా తెలంగాణలో యురియా కొరత ఏర్పడిందని ఆ లేఖలో ప్రస్తావించారు. సరైన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోరంగా విఫలమైందని రాసుకొచ్చారు.

జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ-తెలంగాణకు యూరియా కేటాయించింది కేంద్రం.  రాజకీయ మైలేజీ కోసం ఈ క్రెడిట్ తమ  ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. మా ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకుంటున్నాయి. అసలు యూరియా కొరత కేంద్రం సృష్టించిందనే వాదన సైతం లేకపోలేదు. మొత్తానికి కొద్దిరోజులుగా అన్నదాతల ఆందోళనకు తెరపడింది.

 

Related News

BRS Politics: యూరియా కబురొచ్చింది.. ఇరుకునపడ్డ బీఆర్ఎస్, ఆ నిర్ణయం మాటేంటి?

KTR Vs Kavitha: గులాబీ శ్రేణుల్లో గుబులు.. ముదిరిన అన్న, చెల్లెలి వివాదం

Weather News: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, జాగ్రత్తగా ఉండడి..!

Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్

Gachibowli News: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల నుంచి 25 ప్లాట్లను అద్దెకు తీసుకుని.. చివరకు?

Big Stories

×