Revanth Govt: మహా శివరాత్రి వేళ తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పేసింది. ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో నిధులు జమ అయ్యాయి. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్లనున్నాయి.
శివరాత్రి రోజు శుభవార్త
తెలంగాణలో ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పేసింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూలీల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. మొత్తం 18 వేల 180 మందికి 6 వేల చొప్పున జమ చేసింది. ఆ రెండు జిల్లాల్లో 66 వేల 240 మంది ఉపాధి కూలీలు ఉన్నారు.
లబ్ధిదారులకు నిధులు 66,240 మంది కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ చేశారు. ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.65 కోట్లు చెల్లింపు చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులందరికీ నిధులు డిబిటి పద్ధతిలో కూలీల ఖాతాల్లోకి నేరుగా చేరనున్నాయి.
నెలరోజుల కిందట ప్రారంభం
జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. ప్రతి మండలంలో ఓ గ్రామాన్ని ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం. మండలి ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు నిలిచిపోయాయి.
ALSO READ: గ్రాడ్యుయేట్స్ పై కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ కు కారణాలివే
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు 50.65 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్దదిక్కుగా నిలుస్తుందని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆర్దిక చేయూత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రవేశపెట్టింది రేవంత్ సర్కార్. ఒక సీజన్‌కు 6000 రూపాయలు చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం.
పండగపూట రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
ఎన్నికల కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
మండలానికి ఒక గ్రామం చొప్పున రైతు కూలీల ఖాతాల్లో నిధులు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఇవాళ… pic.twitter.com/aWfytBg4gi
— BIG TV Breaking News (@bigtvtelugu) February 26, 2025