Raviteja:మాస్ మహారాజా రవితేజ (Raviteja ), యంగ్ బ్యూటీ శ్రీ లీల (SreeLeela) కాంబినేషన్లో 2022లో వచ్చిన చిత్రం ‘ధమాకా’. ఈ సినిమాతో అటు శ్రీ లీల, ఇటు రవితేజ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఈ సినిమా భారీ విజయం అందుకొని.. రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అంతేకాదు రవితేజ కెరియర్ లోనే మొదటి రూ.100 కోట్ల గ్రాస్ వసూల్ సినిమాగా నిలిచింది. అంతే కాదు శ్రీలీలాకి కూడా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది. ఈ సినిమా తర్వాతే ఆమెకు పలు చిత్రాలలో హీరోయిన్గా అవకాశాలు కూడా లభించాయి. ఈ సినిమా తర్వాత అటు రవితేజ మళ్ళీ ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ కొట్టలేదు అనడంలో సందేహం లేదు.. ఇక త్వరలోనే ఈయన ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పైగా ఈ సినిమా విజయం సాధిస్తుందని అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అటు ఈ చిత్ర దర్శకుడు త్రినాధ రావు నక్కిన(Trinatha Rao Nakkina)కూడా ‘మజాకా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అటు ఈ సినిమా ఇప్పుడు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
ధమాకా సీక్వెల్ పై స్పందించిన డైరెక్టర్..
ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన త్రినాధ రావు నక్కిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చెప్పి అభిమానులను సంతోషపరిచారు. త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ..” మొదట మజాకా సినిమాకి కూడా సీక్వెల్ అనుకున్నాము. డబుల్ మజాకా అని టైటిల్ కూడా పెడదామనుకున్నాం. సినిమా చివర్లో టైటిల్ వేద్దామనుకున్నాం. కానీ భవిష్యత్తులో అది రూపు దిద్దుకుంటుందో లేదో అనే అనుమానంతో ప్రస్తుతానికి ఆపేసాము. ఇక ఇప్పుడు రవితేజకి ఒక కథ చెప్పాను. అది ధమాకాకు మించి ఉంటుంది. దానికి కూడా డబుల్ ధమాకా అని టైటిల్ పెట్టాలనుకున్నాము. మజాకా రిలీజ్ అవ్వకముందు డబుల్ మజాకా చేద్దామా? డబుల్ ధమాకా చేద్దామా? అని నిర్మాతలతో మాట్లాడి డిసైడ్ అయ్యాము. ఇక అందులో భాగంగానే డబుల్ ధమాకా సినిమా కథను మొదటి రవితేజకు వినిపిస్తే.. ఆయన కూడా ఓకే చెప్పారు. దీంతో ధమాకా సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాము అని త్రినాధ రావు తెలిపారు.
Samantha: చైతూని మర్చిపోలేకపోతున్న సామ్.. ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ..!
రవితేజ తో త్వరలో డబుల్ ధమాకా..
మొత్తానికైతే ధమాకా సీక్వెల్ ఉంటుందో లేదో తెలియదు కానీ రవితేజతో డబుల్ ధమాకా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక మజాకా సినిమా తర్వాత అటు సందీప్ కిషన్ (Sandeep Kishan) కూడా మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ ప్రస్తుతం జాతర సినిమా మాత్రమే చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా రవితేజ త్రినాధ రావు నక్కిన కాంబినేషన్లోనే సినిమా ఉంటుందని, రవితేజ మాస్ జాతర సినిమాతో పాటు ఈ డబుల్ ధమాకా తో పాటు మరో హిట్ అందుకోబోతున్నారని భావిస్తున్నారు. మరి డబుల్ ధమాకాలో కూడా శ్రీ లీల హీరోయిన్గా ఉంటుందా ? లేదా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై కూడా మేకర్స్ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.