Big Stories

Revanth Reddy: దారుణం.. ఘోరం.. రేవంత్‌ను జైల్లో అంతగా టార్చర్ చేశారా?

Revanth Reddy jail

Revanth Reddy: రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం వింటే ఎవరికైనా దారుణం అనిపిస్తుంది. జైల్లో తనను ఎంతగా టార్చర్ చేశారో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. రేవంత్ కంట కన్నీరు కారింది.

- Advertisement -

కేసీఆర్ నుంచి డబ్బులు తీసుకున్నావంటూ ఈటల చేసిన ఆరోపణలను రేవంత్ తట్టుకోలేకపోయారు. కేసీఆర్‌పై తాను అంతలా పోరాడుతుంటే.. కేసీఆర్ తనను అంతలా వేధిస్తుంటే.. మధ్యలో ఈటల వచ్చి తాను ఆయన్నుంచి డబ్బులు తీసుకున్నానని అనడంతో రేవంత్ కోపం నషాలానికి తాకింది. ఈటలపై చిచ్చర పిడుగులా చెలరేగిపోయారు. ఈ సందర్భంగా కేసీఆర్ తనను ఎంతలా టార్చర్ చేశారో చెప్పిన విషయాలు వింటే.. ఎవరికైనా బాధనిపించాల్సిందే.

- Advertisement -

జన్వాడలో కేటీఆర్ ఫాంహౌజ్. 25 ఎకరాల్లో విశాలమైన లగ్జరీ హౌజ్. ఈ ఫామ్‌హౌజ్ గురించి మొదట బయటకు తీసింది రేవంత్‌రెడ్డినే. అక్రమంగా భూములు ఆక్రమించుకుని నిర్మించారనేది రేవంత్ ఆరోపణ. ఓ డ్రోన్ కెమెరా తీసుకెళ్లి.. కేటీఆర్ ఫాంహౌజ్ మొత్తాన్ని షూట్ చేసి.. బాహ్య ప్రపంచానికి చూపించారు. కట్ చేస్తే, నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌజ్‌ను కెమెరాలో షూట్ చేయించారంటూ రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టి జైలుకు తరలించారు. ఇదే విషయాన్ని లేటెస్ట్‌గా గుర్తు చేశారు రేవంత్.

కేటీఆర్ ఫాంహౌజ్‌పై పోరాడినందుకు తనను 16 రోజులు చర్లపల్లి జైల్లో పెట్టి టార్చర్ చేసినా లొంగలేదని అన్నారు. ఉగ్రవాదులను, కరుడుగట్టిన క్రిమినల్స్‌ను ఉంచే సెల్‌లో తనను వేశారని చెప్పారు. రాత్రిళ్లు తాను పడుకోకుండా లైట్లు వేసి ఉంచేవారని.. ఆ వెలుతురుకు లైట్‌ పురుగులు వచ్చేవని.. ఆ పురుగులను తినడానికి బల్లులు వచ్చేవని.. ఇలా రాత్రంతా తాను నిద్ర పోకుండా ఎంతగా వేధించారో అంతకంటే ఎక్కువే టార్చర్ చేశారంటూ రేవంత్‌రెడ్డి ఎమోషనల్ అయ్యారు. గతంలో తన కూతురు ఎంగేజ్‌మెంట్ సమయంలోనూ తనను జైల్లో ఉంచి మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారని.. బెయిల్ రాకుండా చేసి నెలల తరబడి జైల్లో ఉంచారని గుర్తు చేశారు.

అయినా, తాను ఎక్కడా తగ్గకుండా కేసీఆర్‌పై పోరాడుతూ వస్తున్నానని.. అలాంటి తనను పట్టుకుని కేసీఆర్‌ నుంచి డబ్బులు తీసుకున్నానని అంటావా రాజేంద్ర? అంటూ ఈటలను కడిగిపారేశారు రేవంత్‌రెడ్డి. జైల్లో చిప్పకూడు తింటే తెలుస్తుంది ఆ నొప్పి ఎలా ఉంటుందోనంటూ ఈటల రాజేందర్‌పై ఘాటుగా మండిపడ్డారు.

తానే కాదు.. తనతో పాటు తన అన్నదమ్ములమంతా ఆస్తులన్నీ అమ్మైనా సరే.. కేసీఆర్‌ను గద్దె దించే వరకూ పోరాడతామని సవాల్ చేశారు. తన తర్వాత కూడా తన నాలుగు తరాలూ ఆ కుటుంబంపై పోరాడుతూనే ఉంటాయని హెచ్చరించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News