BigTV English

Roja: రోజా బర్త్ డే స్పెషల్.. కూతురు సినీ ఎంట్రీపై క్లారిటీ!

Roja: రోజా బర్త్ డే స్పెషల్.. కూతురు సినీ ఎంట్రీపై క్లారిటీ!

Roja: మంత్రి ఆర్కే రోజా. ఆమె కూతురు అన్హుమాలిక. రోజాలానే కూతురు కూడా సినిమా రంగంలోకి రాబోతోందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ హీరో కొడుకు సరసన హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. పుట్టినరోజు సందర్భంగా తన డాటర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు మంత్రి రోజా. తన కుమార్తె, కుమారుడు యాక్టింగ్ చేయడం తప్పని తాను ఎప్పుడూ అననని రోజా చెప్పారు. ఇద్దరూ యాక్టింగ్ చేయాలని అనుకుంటే, ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే తాను సంతోషంగా స్వాగతిస్తానన్నారు ఆర్కే రోజా. కానీ…..


తన కూతురుకు సైంటిస్టు కావాలని అనుకుంటోందని.. ప్రస్తుతానికి సినిమాల్లో నటించే ఆలోచన ఏమీలేదని మంత్రి రోజా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అన్షుమాలికకు స్టడీస్ అంటే చాలా ఇష్టమని.. ప్రస్తుతం తను బాగా చదువుకుంటుందని.. ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే మాత్రం.. ఒక తల్లిగా, హీరోయిన్‌గా తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని రోజా అన్నారు.

మంత్రి రోజా తన జన్మదిన సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. రోజాతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, జబర్దస్త్ టీం సభ్యులు, ప్రముఖ సింగర్ మంగ్లీ తదితరులు రోజాతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక్ మాసంలో తిరుమలకు రావడం, పుట్టిన రోజున వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామివారి దివ్యరూపాన్ని ఎన్నిసార్లు చూసినా మర్చిపోలేనిదని అన్నారు.


తిరుపతిలో పుట్టడం, పెరగడం, చదువు కోవడం.. సినిమాల్లో రాణించడం గర్వంగా ఉందన్నారు. స్వామి వారి ఆశీస్సులు, సీఎం జగన్ అండదండలతో రాజకీయాల్లో రాణిస్తున్నట్టు మంత్రి రోజా చెప్పారు.

Related News

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..

Big Stories

×