Elon Musk: ఎలాన్ మస్క్. ట్విట్టర్ కొనుగోలు నుంచీ డైలీ ట్రెండింగ్ లో ఉంటున్న నేమ్. వేలాదిగా ఉద్యోగులపై వేటు వేస్తూ.. పని గంటలు పెంచుతూ.. సీఈఓగా చెలరేగిపోతున్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తున్నారు. ఇలా ఫుల్ బిజీగా ఉన్న మస్క్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వచ్చింది. అప్పుడు-ఇప్పుడు అనేలా రెండు మస్క్ ఫోటోలు ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఓ ఫోటోలో ఎలాన్ చాలా లావుగా ఉన్నారు. ఇంకో ఫోటోలో చాలా చాలా స్లిమ్ అయ్యారు. ఇదెలా సాధ్యం అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ కొన్నందుకు టెన్షన్ లో వెయిట్ లాస్ అయ్యారా? ఫుల్ వర్క్ ప్రెజర్ తో సిక్ అయ్యారా? అంటూ కామెంట్లు వచ్చాయి. ఆ ట్వీట్ కు నేరుగా మస్క్ నుంచే ఆన్సర్ వచ్చింది.
అవును, తాను 13 కిలోలు బరువు తగ్గానంటూ.. ఆ స్లిమ్ సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ కొన్నందుకు కాదు.. హెల్త్ పై ఫోకస్ పెట్టినందుకు తాను వెయిట్ లాస్ అయ్యానంటూ సెలవిచ్చారు. మూడు పద్దతులు ఫాలో అవడం వల్ల తాను బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చారు మస్క్.
మెయిన్ రీజన్.. ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్. మన భాషలో చెప్పాలంటే ఉపవాసం. రోజులో చివరి భోజనానికి, మర్నాటి మొదటి భోజనానికి మధ్య 16 గంటల గ్యాప్ ఉండటమే ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్. ప్రస్తుతం వాల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది ఈ ఫాస్టింగ్ విధానం. మన రుషులు శతాబ్దాల క్రితమే చెప్పిన ఈ విధానాన్ని.. ఇటీవల ఓ జపాన్ సైంటిస్ట్ ప్రయోగ పూర్వకంగా నిరూపించడంతో ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వరించింది. ఆ ఫాస్టింగ్ వల్లే తాను భారీగా బరువు తగ్గానని మస్క్ అన్నారు.
ఇక, మిగతా రెండు కారణాల్లో ఒకటి డయాబెటిస్ కు సంబంధించిన రెండు రకాల మెడిసిన్ వాడటం.. అని చెప్పారు. మరోవైపు, తనకు అందుబాటులో ఎలాంటి టేస్టీ ఫుడ్ లేకుండా చూసుకోవడం వల్ల కూడా సన్నగా అయ్యానని అన్నారు మస్క్. ఆయన ఎలా బరువు తగ్గినా.. ట్విట్టర్ టెన్షన్ వల్లే చిక్కిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు మాత్రం ఆపడం లేదు.