EPAPER

Delhi Murder: వెబ్ సిరీస్ చూసి అలా.. శ్రద్ధా మర్డర్ కేసులో సంచలన విషయాలు

Delhi Murder: వెబ్ సిరీస్ చూసి అలా.. శ్రద్ధా మర్డర్ కేసులో సంచలన విషయాలు

Delhi Murder: వాడు మనిషి కాదు. ఉన్మాది.. సైకో.. సైతాన్.. ఏ పేరు పెట్టినా తక్కువే. ప్రేయసిని దారుణంగా చంపేసి.. ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. ఫ్రిజ్ లో దాచేసి.. శరీరభాగాలను అడవుల్లో వెదజల్లిన నరరూపరాక్షసుడు. ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్య కేసు విచారణలో ఆఫ్తాబ్ గురించి మరిన్ని గగుర్పొడిచే విషయాలు వెలుగు చూస్తున్నాయి. డెక్స్‌టర్‌ అనే ఇంగ్లిష్‌ క్రైమ్‌ షో చూసి వాడెంతగా తెగించాడో తెలిసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఫ్రిజ్‌లో శ్రద్ధావాకర్ శరీర భాగాలు ఉండగానే.. వాటి పక్కనే ఫుడ్, వాటర్, మిల్క్ ఉంచి వాడుకునే వాడంటే.. వాడే మనిషా? మృగమా?


శ్రద్ధా వికాస్‌ వాకర్‌. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ కు చెందిన యువతి. 2018లో కాల్ సెంటర్ జాబ్ కోసం ముంబై వచ్చింది. అక్కడే ఓ డేటింగ్ యాప్ ద్వారా అఫ్తాబ్ తో పరిచయం. ఆ తర్వాత లవ్. కొంతకాలం డేటింగ్. అఫ్తాబ్ తో ప్రేమ, సహజీవనం గురించి ఇంట్లో చెప్పగా.. కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో, ఫ్యామిలీని వదిలేసి.. రెండేళ్ల పాటు అఫ్తాబ్ తోనే ఉంది శ్రద్ధావాకర్.

కట్ చేస్తే.. కొంతకాలానికే అఫ్తాబ్ టార్చర్ పెరిగింది. పదే పదే తిట్టేవాడు. కొట్టేవాడు. మరోవైపు ఇరువైపుల కుటుంబాల నుంచి ప్రెజర్ పెరగడంతో.. వాళ్లిద్దరూ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఓ కాల్ సెంటర్ లో జాబ్ చూసుకుని.. అద్దె ఇంట్లోకి మారారు. అప్పటినుంచి శ్రద్ధావాకర్ నుంచి ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఈ ఏడాది మే నుంచి ఆమె సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది. శ్రద్ధా ఆచూకీ కోసం చాలాకాలం రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. చివరికి నవంబర్ 9న మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రద్ధా పేరెంట్స్. ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఇక అసలైన ఎంక్వైరీ మొదలైంది. పెద్ద క్రైం స్టోరీ వెలుగుచూసింది.


అనుమానంతో అఫ్తాబ్ ను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ప్రశ్నిస్తే తనకేం సంబంధం లేదన్నాడు. మే నెలలో తనతో గొడవపడి శ్రద్ధా ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. పోలీసులు వాడు చెప్పిన విషయాలు నమ్మలేదు. తమదైన స్టైల్ లో విచారించగా.. విషయం మొత్తం కక్కేశాడు.

మే 18 రాత్రి దారుణం..
పెళ్లి విషయంలో మే18 రాత్రి శ్రద్ధా-అఫ్తాబ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో అఫ్తాబ్‌ ఆమె గొంతునులిమి చంపేశాడు. శవాన్ని బాత్‌రూమ్‌లో ఉంచాడు. డెక్స్‌టర్‌ అనే ఇంగ్లిష్‌ క్రైమ్‌ షో గుర్తొచ్చింది. ఆ సిరీస్ లో మాదిరే.. శవాన్ని ఫ్రిజ్ లో దాచి.. ఆ తర్వాత ముక్కలు చేశాడు.

మే 19న ఓ ఫ్రిజ్, రంపం, ప్లాస్టిక్‌ కవర్లు ‌ కొన్నాడు. ఆ తర్వాత డెడ్ బాడీ కోయడం స్టార్ట్ చేశాడు. ఒక్కరోజులో పని కాకపోవడంతో.. కొన్ని రోజుల పాటు రోజుకింత చొప్పున శ్రద్ధా శరీరభాగాలు కట్ చేశాడు. అన్నిరోజులూ ఫ్రిజ్ లోనే శవాన్ని ఉంచి.. ఇంకొంచెం ప్లేస్ ఉండటంతో.. ఫుడ్, వాటర్ ఆ ఫ్రిజ్ లోనే ఉంచి వాడుకున్నాడంటే.. వాడెంత ఉన్మాదిగా మారాడో తెలుస్తోంది. అలా జూన్ 5వరకూ గడిపాడు. అర్థరాత్రి వేళల్లో బయటకు వెళ్లి వేర్వేరు చోట్ల శ్రద్ధా శరీరభాగాలను విసిరేసేవాడు. అలా 18 రోజుల పాటు చేశాడు.

మే 18న ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. కొద్దిదూరంలోనే ఉన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్‌లో కొన్ని గుర్తుతెలియని శరీరభాగాలను పోలీసులు గుర్తించారు. రామ్‌లీలా మైదానానికి సమీపంలో.. చెత్తకుప్పలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మనిషి తల, చేతులు లభించాయి. వాటిని ఇప్పుడు డీఎన్‌ఏ పరీక్షలకు పంపించి.. అవి శ్రద్ధావేనా? కాదా? అని తేల్చే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రద్ధాను హత్య తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి.. ఢిల్లీలోని పలుచోట్ల విసిరేసినట్లు అఫ్తాబ్‌ పోలీస్ విచారణలో అంగీకరించాడు. ఎక్కువగా మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేసినట్లు చెప్పడంతో.. నిందితుడిని తీసుకుని అక్కడ వెతికితే కుళ్లిన స్థితిలో ఉన్న 10కి పైగా శరీర భాగాలు దొరికాయి. శ్రద్ధా దుస్తులు, అఫ్తాబ్ వాడిన రంపం ఇంకా దొరకలేదు. కీలక ఆధారంగా మారిన ఫ్రిజ్ ను పోలీసులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిచారు. కానీ, అప్పటికే అఫ్తాబ్ ఆ ఫ్రిజ్ ను యాసిడ్ తో కడిగి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా క్లీన్ చేయడంతో విచారణ మరింత క్లిష్టంగా మారింది. కేసు విచారణ పోలీసులకు సవాల్‌గా మారింది.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×