BigTV English

Robots In SLBC Tunnel: మరో రెండు రోజులు.. కీలక దశకు రెస్క్యూ

Robots In SLBC Tunnel: మరో రెండు రోజులు.. కీలక దశకు రెస్క్యూ

Robots In SLBC Tunnel: గంటలు గడుస్తున్నాయి..! రోజులు మారుతున్నాయి..! అందరిలో ఒకటే ఉత్కంఠ, చర్చ.. SLBC టన్నెల్‌ ఆపరేషన్‌. సహాయక చర్యలు మొదలు పెట్టి వారం గడుస్తున్నా, సొరంగం లోపల పరిస్థితులు రెస్క్యూ బృందాలకు ఛాలెంజ్‌గా మారాయి. నాలుగు షిఫ్టుల్లో 12 సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులను సవాల్‌గా తీసుకొని ముందుకెళ్తున్నాయి. అయితే టన్నెల్‌ లోపల 13.5 కిలో మీటర్ల పాయింట్‌ దగ్గరే అసలు సమస్య ఉంది. నీటి ఊట ఫోర్స్‌గా వస్తోంది. దానికి బురద కూడా తోడవ్వడంతో.. దాన్ని దాటి ముందుకెళ్లలేకపోతున్నాయి. పైగా మట్టిని తొలగించడం కూడా సవాల్‌గా మారింది. కన్వేయర్‌ బెల్టు ఇంకా పనిచేయట్లేదు. ఇవాళ సాయంత్రానికి రిపేర్లు పూర్తై, అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.


రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తవ్వడానికి మరో రెండ్రోజులు పట్టే ఛాన్స్ ఉంది. TBM మిషన్‌ను పూర్తిగా కట్‌ చేయాలి. ఆ తర్వాత మట్టి తొలగించాల్సి ఉంటుంది. కన్వేయర్‌ బెల్ట్‌ ఇవాళ అందుబాటులోకి వస్తే.. రెస్క్యూ ఆపరేషన్‌ ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి రిపేర్ పూర్తయ్యే అవకాశం ఉంది. కన్వేయర్ బెల్టు అందుబాటులోకి వస్తే రెస్క్యూ ఆపరేషన్‌ మరింత స్పీడప్ కానుంది. TBM మిషన్ వెనుక పెద్ద ఊబి ఉందంటున్నారు అధికారులు. 13.5 కిలో మీటర్‌ దగ్గర నీటి ఊట ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

ఇటు GPR గుర్తించిన నాలుగు చోట్ల 5 నుంచి 12 మీటర్ల బురద పేరుకుపోయింది. ఇప్పటికే ఒకచోట 9 మీటర్లు తవ్వగా, TBM పార్ట్స్ మాత్రమే లభించాయి. మిగితా మూడుచోట్ల తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం నాలుగు షిఫ్టుల్లో 70 మందితో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం పూర్తవ్వడానికి మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. టీబీఎం మిషన్ కట్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. టన్నెల్‌లో మృతి చెందిన 8 మందిలో నలుగురు TBM మిషన్ ముందు భాగంలో కూరుకుపోయారని అధికారులు తెలిపారు.


నలుగురు కార్మికులు 3 మీటర్ల లోతులో, మిగతా నలుగురు 7 మీటర్ల లోతు బురదలో కూరుకుపోయారు.  మట్టి తీయడంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో 15 గంటల్లో మృతదేహాలను బయటకు తీస్తామంటోంది రెస్క్యూ టీమ్చె. రెస్క్యూ ఆపరేషన్‌లో NDRF,SRDF, రాట్ హోల్ మైనర్స్, మార్కోస్ టీం, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ఇది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఆదివారం నాడు టన్నెల్‌ను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి.. రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి చూశారు. అధికారులు, సహాయక బృందాలతో స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. ఆ తర్వాత రెస్క్యూ టీమ్స్‌.. ముఖ్యమంత్రికి పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చాయి. ఐతే సహాయక చర్యలు చేపట్టే సిబ్బంది భద్రత కూడా ముఖ్యమని సూచించారు రేవంత్‌రెడ్డి. అవసరమైతే రోబోల సేవలు వాడుకోవాలన్నారు. రోబోలతో రిస్కు కూడా ఉండదని, బెట్టర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఆ దిశగా ఆలోచించాలని అధికారులు, రెస్కూటీమ్స్‌కు సూచించారు. ప్రపంచంలో ఎక్కడ ఎక్స్‌పర్ట్స్‌ ఉన్నా, పిలిపించాలని సూచించారు. సొరంగం కుడి, ఎడమవైపుల నుంచి పరికరాలు పంపిస్తే, ఫలితం ఉండొచ్చన్నారు సీఎం.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×