E-Paper
Advertisement

బౌన్స్ అవుతున్న EMI లు.. బల్ధియా అధికారుల నిర్లక్ష్యానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బలి..!

బౌన్స్ అవుతున్న EMI లు.. బల్ధియా అధికారుల నిర్లక్ష్యానికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బలి..!
Advertisement

Salary Delay: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలందించే మూడు కార్పొరేషన్లలోనూ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో అధికారులు తీవ్ర వివక్షను చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో కలిపి సుమారు మూడు వేల పై చిలుకు పర్మినెంట్ ఉద్యోగులు, మరో 24 వేల వరకు ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీటిలో పర్మినెంట్ ఉద్యోగులైన అటెండర్లకు నెలకు రూ.80 వేల నుంచి సీనియార్టీని బట్టి రూ. లక్ష వరకు జీతాలున్నాయి. ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో కంప్యూటర్ ఆపరేటర్ వంటి కీలక విధులు నిర్వర్తించే వారికి నెలకు రూ. 30 వేలకు మించి జీతాల్లేవు. ఇక విధి నిర్వహణ, పని భారం ప్రస్తావనకు వస్తే పర్మినెంట్ ఉద్యోగుల కంటే నామమాత్రపు జీతాలకే పని చేస్తున్న ఔట్ సోర్స్, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకపోవటంతో భయంతో అంకితాభావంతో విధులు నిర్వహిస్తున్నారు.

ప్రతి నెల ఒకటో తేదీన..

కానీ ఇలాంటి వారే జీతాల చెల్లింపులో తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ప్రస్తుతం సుమారు రూ. 4786 కోట్ల అప్పుల కల్గిన జీహెచ్ఎంసీ ప్రతి నెల రూ. 100 కోట్ల నుంచి రూ. 110 కోట్ల మధ్య అసలు, మిత్తీలుగా ప్రతి నెల కుస్తీలు చెల్లిస్తుంది. మూడు కార్పొరేషన్లలోని ఉద్యోగులకు ప్రతి నెల సుమారు రూ. 130 నుంచి రూ. 135 కోట్ల మధ్య జీతాలు, పెన్షన్లను చెల్లిస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఖజానాలో పుష్కలంగా నిధులున్న సమయంలో ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపులు జరిగేవి. కానీ కొద్ది సంవత్సరాల నుంచి జీతాల చెల్లింపులు ప్రతి నెల 1వ తేదీ నుంచి దాదాపు 15, 20వ తేదీవరకు జరుగుతున్నట్లు తెలిసింది. నాలుగో తరగతి పర్మినెంట్ ఉద్యోగుల్లో కొందరికి, ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో అత్యధిక మంది ఉద్యోగులకు ప్రతి నెల 10వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు జీతాలు చెల్లిస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. తక్కువ జీతాలు కల్గిన ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులకు ముందే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఎలాగో ఉద్యోగ భద్రత కల్గిన పర్మినెంట్ ఉద్యోగులకు ఆ తర్వాత జీతాలు చెల్లించాలన్న వాదనలు విన్పిస్తున్నాయి.

Advertisement

Also Read: తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లకు బ్రేక్.. భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్‌తో సేవలకు అంతరాయం

తప్పుు ఎవరిదీ? శిక్ష ఎవరికి?

జీహెచ్ఎంసీలో ఉద్యోగులకు, కార్మికులకు అధికారులు సకాలంలో జీతాలు చెల్లించకపోవటంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం ఎలక్ట్రానిక్, ఇతర పరికరాలు, గృహోపకరణాలు వంటివి వాయిదాల పద్దతిలో తీసుకున్న ఉద్యోగులు కొద్ది సంవత్సరాల నుంచి సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వరకు ప్రతి నెల ఈఎంఐలు 3వ తేదీ నుంచి 5,6వ తేదీల మధ్య ఖాతాల నుంచి ఆటోమెటిక్ గా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ అయిపోతాయి. కానీ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సకాలంలో జీతం క్రెడిట్ కాకపోవటంతో ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగుల ప్రతి నెల ఈఎంఐలు బౌన్స్ అవుతున్నట్లు వాపోతున్నారు. బౌన్స్ అయిన తర్వాత ఈఎంఐలు చెల్లించాలంటే చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ ను బట్టి కనిష్టంగా రూ. 700 నుంచి రూ. 1200 వరకు అదనంగా చెల్లిస్తున్నట్లు వాపోతున్నారు. దీంతో తాము చెల్లించాల్సిన ఈఎంఐకి అదనంగా చెల్లించటంతో పాటు తమ బ్యాంక్ ఖాతాల సిబిల్ రేట్లు పడిపోతున్నట్లు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా ఈఎంఐలు బౌన్స్..

Advertisement

900 నుంచి 950 వరకు కూడా గతంలో సిబిల్ రేటు కల్గిన ఉద్యోగుల సిబిల్ రేటు వరుసగా ఈఎంఐల బౌన్స్ కారణంగా ఇపుడు 700 నుంచి 750 కి సిబిల్ రేటు పడిపోయినట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ఉదాహరణకు జీహెచ్ఎంసీలో ఔట్ సోర్స్ ప్రాతిపదికన డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు 6వ తేదీ వచ్చినా, ఇంత వరకు జీతాలు చెల్లించలేదని వాపోతున్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జీతాలు క్రెడిట్ కాగా, కొన్ని జోన్లలో ఇంకా పర్మినెంట్ ఉద్యోగులకు కూడా జీతాలు క్రెడిట్ కాలేదని తెలిసింది. కొన్ని సందర్భాల్లో దసరా, దీపావళి పండుగల సమయాల్లోనూ సకాలంలో జీతాలు క్రెడిట్ కాకపోవటంతో ఉద్యోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. వరుసగా ఈఎంఐలు బౌన్స్ కావటంతో అదనంగా చెల్లించి, విసిగి, వేసారిన కొందరు ఉద్యోగులు నెలాఖరు రాగానే తమ ఈఎంఐకు సరిపోయేటంత నగదును అప్పుుగా తెచ్చుకుని బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకుంటున్నారు. ఈ రకంగా డబ్బు ఇచ్చే వడ్డీ వ్యాపారులు నూటికి అయిదు మిత్తీగా వసూలు చేసుకుంటున్నట్లు, పది వేల కన్నా ఎక్కువ అప్పుుగా తీసుకునే వారు అయిదు శాతం వడ్డీ చెల్లించటంతో పాటు వారి బ్యాంక్ ఏటీఎం కార్డు సదరు వడ్డీ వ్యాపారికి అప్పగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Also Read: రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×