BigTV English

Sankranthiki Vasthunam Movie Review : సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ

Sankranthiki Vasthunam Movie Review : సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ

Sankranthiki Vasthunam Movie Review and Rating : సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రోజుల్లో కంటే సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలకు మంచి రెవిన్యూ వస్తుంది. సినిమాకి మంచి టాక్ వస్తే చాలు కలెక్షన్లు కొత్తదారులు వెతుక్కుంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు. ఇదే విషయాన్ని దిల్ రాజు చాలా ఏళ్ల నుంచి పరిగణలోకి పెట్టుకొని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఖచ్చితంగా ఒక సినిమా విడుదల చేస్తూ ఉంటారు. అయితే దిల్ రాజుకు ఈ సంక్రాంతి కొంచెం ప్రత్యేకమని చెప్పాలి. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, అలానే డిస్ట్రిబ్యూట్ చేసిన డాకు మహారాజ్, వీటితోపాటు దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదలయ్యాయి. అయితే చాలామంది మంచి అంచనాలు పెట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం. 


కథ: 

సీఎం కేశవ (వీకే. నరేష్) పిలుపుతో ఇండియాకు వచ్చిన ఒక టాప్ మోస్ట్ బిజినెస్ మేన్ సత్య ఆకెళ్ళ (అవసరాల శ్రీనివాస్) ను ఒక బిజ్జు పాండే ముఠా కిడ్నాప్ చేస్తుంది. తమ అన్నను విడిచి పెడితేనే సత్య ఆకెళ్ళను విడిచిపెడతామని ఆ ముఠా సీఎం కి చెప్పుకొస్తారు. ఆకెళ్లను తిరిగి సీఎం కి అప్పజెప్పడానికి ఎక్స్ ఆఫీసర్ యాదగిరి రాజు ( విక్టరీ వెంకటేష్) రంగంలోకి దిగుతాడు. పోలీస్ డిపార్ట్మెంటును యాదగిరి రాజు ఎందుకు వదిలేశాడు.? పోలీస్ డిపార్ట్మెంట్ ను వదిలేసి తన ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న యాదగిరి రాజు డిపార్ట్మెంట్ కి వచ్చి ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు.? ఆల్రెడీ పెళ్లి అయిపోయిన యాదగిరి రాజు జీవితంలోకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీను (మీనాక్షి చౌదరీ) వచ్చిన తర్వాత వచ్చిన సమస్యలేంటి.? మళ్లీ యాదగిరి రాజు డిపార్ట్మెంట్ లోకి ఎందుకు చేరాల్సి వచ్చింది.? ఆకెళ్లను మళ్లీ తిరిగి అప్పగించాడా.? లాంటి అంశాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ :

ప్రతి దర్శకుడికి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. అలా అనిల్ రావిపూడి టార్గెట్ చేసిన ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి వినోదం అందిస్తే చాలు అని బలంగా నమ్మిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈ సినిమాతో కూడా అనిల్ అదే పంథాను కొనసాగించాడు. అయితే సినిమాలో కథతో పాటు కామెడీ ఉంటే బాగుంటుంది. కానీ కామెడీని మాత్రమే నమ్ముకుని కథను చేశామంటే అది పెద్దగా వర్కౌట్ అవ్వదు. జాతి రత్నాలు లాంటి సినిమాలో కూడా కథకి ఒక స్కోప్ ఉంది. అయితే ఈ సినిమాలో కథ ఉంది కానీ అది అంత బలంగా లేదు. కానీ ఆ కథకు తగ్గట్టుగా కొన్ని కామెడీ సీన్స్ ను పండించే విధానంలో సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి.

ఈ సినిమాకి సంబంధించి ఫస్టాఫ్ చూసిన వెంటనే ఎఫ్2 మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుంది అని ఒక అంచనా వస్తుంది.కానీ ఈ సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే అనిల్ కొన్నిచోట్ల చేతులెత్తేసాడు అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ లో వర్క్ అవుట్ అయినంత కామెడీ సెకండ్ హాఫ్ లో వర్కౌట్ కాలేదు. కథ కూడా మామూలుగా ఉండటంతో ప్రేక్షకుడికి అంత ఆసక్తిగా అనిపించదు. ప్రిడిక్టబుల్ స్టోరీని చాలాసేపు సాగదీస్తూ సెకండాఫ్ లో చెప్పుకొచ్చాడు. కథను వినోదభరితంగా చెప్పడంతో పాటు అయితే సినిమాలో ఏదో ఒక మెసేజ్ ను చెప్తాడు అనిల్. అలానే ఈ సినిమాలో కూడా అటువంటి మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అది ఆడియోనికి కన్విన్సింగ్ గా అనిపించదు. ఏదో కావాలని పెట్టారు అనే అభిప్రాయం రాకమానదు.

కానీ ఈ సినిమాలో కొన్నిచోట్ల అనిల్ రాసిన డైలాగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ ను ఉద్దేశిస్తూ హిస్టరీలో ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీయే అనే డైలాగ్ రియల్ లైఫ్ సిట్యుయేషన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఎఫ్2 మాదిరిగానే భార్య భర్తల కామెడీ సీన్స్ ఈ సినిమాలో వర్కౌట్ చేశాడు. సాధారణ ప్రేక్షకులకు ఇవి నచ్చకపోయినా.. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఇవి నచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అనిల్ అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుంది అని చెప్పలేము. కానీ కొంతమంది ప్రాక్షకులు మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పడతారు అని చెప్పొచ్చు.

విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాజు పాత్రలో వెంకటేష్ ఒదిగిపోయి అద్భుతంగా ఎంటర్టైన్ చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పాత్ర విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా గోదావరి యాసలో చెప్పిన డైలాగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బుల్లి రాజు క్యారెక్టర్ గురించి, బుల్లి రాజు క్యారెక్టర్ ప్రేక్షకుడిని విపరీతంగా నవ్వించింది.

ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ కొంతవరకు ప్లస్ పాయింట్. ముఖ్యంగా గోదారి గట్టు పైన సాంగ్ విజువల్ గా కూడా చాలా బాగా చూపించారు. కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వర్కౌట్ చేశాడు భీమ్స్. వెంకటేష్ పాడిన బ్లాక్ బస్టర్ పొంగళ్ సాంగ్ సిచువేషన్ కి సంబంధం లేకుండా వచ్చింది అనే ఫీల్ కలిగిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

వెంకటేష్
కామెడీ
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ, స్క్రీన్ ప్లే
సెకండాఫ్

మొత్తంగా… స్టోరీ, లాజిక్స్ వద్దు అనుకుంటే… ఈ కామెడీ మూవీని ఓ సారి చూడొచ్చు.

Sankranthiki Vasthunam Movie Rating : 3/5

Related News

Actress Raasi: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Actress Raasi : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Actress Raasi : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Big Stories

×