Santosh Rao Assets: నానక్‌రామ్‌గూడలో బీఆర్ఎస్ మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ రావు అక్రమ ఆస్తుల ఫై విచారణ చేయాలని కాంగ్రెస్ నేత కల్వకుంట్ల రమ్యారావు డిమాండ్ చేశారు. నానక్‌రామ్‌గూడలోని ఎల్‌గేన్స్ ఎంపీరియా భవనాన్ని కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు పరిశీలించారు. జోగినపల్లి సంతోష్‌రావుపై ఉన్న అక్రమ ఆస్తుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సంతోష్‌రావుకు సంబంధించిన ఆస్తుల వివరాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు ఎన్ని, ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని అనే విషయంపై లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. సంతోష్‌రావుకు బినామీల పేర్లపై కూడా ఆస్తులు ఉన్నాయంటూ రమ్యారావు ఆరోపించారు. నానక్‌రామ్‌గూడలోని ఎంపీరియా భవనం 21,940 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని. దీని విలువ సుమారు రూ.21 కోట్ల 46 లక్షల వైట్ అమౌంట్ చెల్లించారని ఆమె పేర్కొన్నారు. ఏంపరియా భవనం అసలు విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని ఆరోపించారు.
ఇంత భారీగా ఆస్తులు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. కేటీఆర్‌కు సంతోష్‌రావుతో సంబంధం లేదని చెబుతున్నారని, అలాంటప్పుడు సంతోష్‌రావును ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సంబంధం లేదని చెబుతున్న సంతోష్‌రావును వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలకు ఇదే తమ హెచ్చరిక అని.. సంతోష్‌రావు ఆస్తులపై పూర్తి వివరాలను తెలంగాణ ప్రజలకు వెల్లడించాలని రమ్యారావు కోరారు. అమరులైన కుటుంబాలకు ఆస్తులు పంచాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ప్రజా పాలన చేస్తున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read: నిహారికకు నేషనల్ అవార్డు.. నాగబాబు పోస్ట్ వైరల్.. వారసత్వం బంగారం అంటూ!