Hanuman Ansh:ఇపుడు ఎక్కడ చూసినా ‘హనుమాన్ అంష్’ ‘హనుమాన్ అంష్’ ‘హనుమాన్ అంష్’ .. చిన్న సినిమాగా వచ్చి ఇది బాక్సాఫీస్ వద్ద చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.2 కోట్లతో తెరకెక్కి పెద్దగా స్టార్ హీరోలు లేకున్నా కంటెంట్ సరిగ్గా క్లిక్ అవడంతో ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరికి పెద్ద షాకే ఇచ్చింది.
సినిమా బాక్సులు సర్దేసుకోవడమే
నీమ్ కరోలి బాబా జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల ఆధారంగా తెరకెక్కిన ఈ డివోషనల్ సినిమా మొదట్లో పెద్దగా హైప్ తెచ్చుకోలేదు. సినిమా విడుదలైన తర్వాత తొలి రెండు వారాల్లో కూడా వసూళ్లు సో సో నే. అలా ఫస్ట్ వీక్ లో సుమారు రూ.1.10 కోట్లు, రెండో వారంలో దాదాపు రూ.50 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో ఇక సినిమా బాక్సులు సర్దేసుకోవడమే అనుకున్నారు అంతా.
మూడో వారం ఏకంగా 10 కోట్లకు పైగా
కట్ చేస్తే సీన్ మారింది.రెండు వారాలు సోసో అనుకున్న సినిమా మూడో వారం ఏకంగా 10 కోట్లకు పైగా వసూళ్లని కొల్లగొట్టింది.ఇక నాలుగో వారంలో ఏకంగా రూ.62 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఐదో వారంలో రూ.91 కోట్లు, ఆరో వారంలో దాదాపు రూ.82 కోట్ల వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలో వినిపిస్తుంది.
అక్కడితో ఆగకుండా ఏడో వారంలో కూడా సినిమా మంచి వసూళ్లు రాబడుతుండటం విశేషం. అలా 43వ రోజు సుమారు రూ.6 కోట్లు, 44వ రోజు రూ.11 కోట్లు, 45వ రోజు దాదాపు రూ.14 కోట్లు, 46వ రోజు సుమారు రూ.3 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.
కలెక్షన్ల విషయానికి వస్తే.
ఇక వరల్డ్‌వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ‘హనుమాన్ అంష్’ ఇప్పటికే రూ.350 కోట్ల మార్క్‌ను దాటిందని సమాచారం. ఇండియాలో నెట్ కలెక్షన్లు భారీగా ఉండగా, ఓవర్సీస్ నుంచి కూడా మంచి వసూళ్లు వచ్చాయి. దీంతో మొత్తం గ్రాస్ రూ.352 కోట్లకు పైగా చేరినట్లు తెలుస్తుంది.
సినిమా విషయానికి వస్తే ఇందులో శోభినవ్ సత్య, విహాన్ షెడ్గే, చందన్ కే ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి తదితరులు నటించగా విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా ఆయనే అందించారు. రాగిని ఎస్, నమ్రత జీ సింగ్, అనుప్రియ ఏ నగర్, విశాల్ చతుర్వేది నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇంకెన్ని వసూల్లని కొల్లగొడుతుందో !
ఇక తెలుగులోనూ ఈ సినిమాని త్రివిక్రమ్ రిలీజ్ చేస్తాడన్న టాక్ వినబడింది కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. మొత్తానికి పెద్ద హీరోలు, భారీ బడ్జెట్లు ఉన్న సినిమాల మధ్యలో ఎలాంటి హంగామా లేకుండా వచ్చిన ‘హనుమాన్ అంష్’ ఇప్పుడు తన కలెక్షన్లతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుందనే చెప్పాలి. చూడాలి మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని వసూల్లని కొల్లగొడుతుందో !
also read :డ్యాన్స్ ఫ్లోర్ నుంచి విలన్ రోల్ వరకు.. రాఘవ్ జుయాల్ జర్నీ ఇదే!