Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ ఈయన రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ (AP Green excutive committee Chairman)గా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఎమ్మెల్సీగా , చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడంతో ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు. ఇలా రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా గడుపుతున్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నాగబాబు తన అధికారిక ఎక్స్ కాస్త ద్వారా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
72 వ జాతీయ చలనచిత్ర అవార్డులు..
నాగబాబు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈయన నిర్మాణ సారథ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా నాగబాబు కూడా గతంలో నేషనల్ అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిహారిక కూడా 72వ జాతీయ చలనచిత్ర అవార్డు(72 National Award) వేడుకలలో భాగంగా ఆమె నిర్మించిన కమిటీ కుర్రాళ్లు (committee kurrollu)సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకుంటున్న నేపథ్యంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.
పురస్కారాలు వెండివే..వారసత్వం బంగారం..
ఈ నేపథ్యంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “36 సంవత్సరాల క్రితం, ఒక తండ్రి రుద్ర వీణ(Rudra Veena)కు సిల్వర్ కమలం అందుకున్నారు. ఈ రోజు, ఆయన కుమార్తె ఉత్తమ ప్రాంతీయ చిత్రానికి సిల్వర్ కమలంతో ప్రకాశిస్తోంది. పురస్కారాలు వెండివి కావచ్చు, కానీ వారసత్వం మాత్రం స్వచ్ఛమైన బంగారం” అంటూ నాగబాబు తన కుమార్తె సక్సెస్ గురించి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా తండ్రితో సమానంగా ఈమె కూడా నేషనల్ అవార్డును అందుకోవడంతో సినీ వారసత్వంలో తండ్రికి తగ్గ తనయ అంటూ అభిమానులు కూడా కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
36 years ago,a father held the Silver Kamal for Rudra https://t.co/UZzJIBswCQ,his daughter shines with the Silver Kamal for best Regional Film.Awards may be silver,but the legacy is pure gold.#72nationalfilmawards @IamNiharikaK @PinkElephant_P pic.twitter.com/lJHVSPIwVo
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 22, 2026
ఇక నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈమె ఇదివరకు ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే వెండి తెరపైకి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ద్వారా నిహారిక నిర్మాతగా పరిచయమయ్యారు అయితే మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నిహారిక ఈ సినిమాకు గాను ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు.. ఇక తాజాగా నేషనల్ అవార్డులు కూడా అందుకోవడంతో మెగా అభిమానులు ఈమెకు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు.
Also Read: పుష్ప మంగళం శీను క్యారెక్టర్ మిస్ చేసుకున్న నటుడు.. రాసి పెట్టలేదంటూ!