School Holidays: పిల్లలకు సెలవులు వచ్చిందంటే చాలు ఎగిరిగంతేస్తారు. సెలవుల్లో ఎంచక్కా ఆడుకునేందుకు రెడీగా ఉంటారు. అయితే ఫిబ్రవరి 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. మహా శివరాత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
రెండు రోజులు సెలవులు
ఫిబ్రవరి 26న హిందువులు అత్యంత పవిత్రమైన పండుగ సందర్భంగా.. మహాశివరాత్రి పండుగను పురష్కరించుకుని ఈరోజున సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఫిబ్రవరి 27 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
ఇక ఫిబ్రవరి 27న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లాల స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తెలంగాణలో ప్రభావిత జిల్లాలు
⦿మెదక్
⦿ నిజామాబాద్
⦿ ఆదిలాబాద్
⦿ కరీంనగర్
⦿ వరంగల్
⦿ ఖమ్మం
⦿ నల్గొండ
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఫిబ్రవరి 27న పాఠశాలలకు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఈ సెలవులు ఎందుకు ముఖ్యమైందంటే..
మహా శివరాత్రి 2025: హిందువులు అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. చతుర్ధశ నాడు వచ్చే మహశివరాత్రిని పర్వదినంగా పేర్కొని, ఎంతో విశిష్టమైన పూజలు నిర్వహిస్తుంటారు. ఈ రోజున భక్తులు భోళా శంకరున్ని, లింగోద్భావ రూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షను తీసుకుని జాగారం చేస్తారు. ఈ నేపథ్యంలోనే శివరాత్రి నాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి27న విద్యాసంస్థలు మూసివేయబడతాయి.
ఎమ్మెల్సీ ఎన్నికలు 2025: ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వర్తిస్తుంది. టీచర్లు, గ్యాడ్యుయేట్ ఓట్లు వేయడానికి అర్హులు.. ఈ తరుణంలో ఎన్నికలు జరగనున్న ఆయా జిల్లాలో పాఠశాలలు తప్పనిసరిగా మూసివేయాలి.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల కాక.. ఆ సీట్లో ఎవరు గెలుస్తారంటే
ఎన్నికల షెడ్యూల్
ఓటింగ్ వేళలు-ఫిబ్రవరి 27న ఉదయం 8గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.
లెక్కింపు: మార్చి3,2025