BigTV English

FBI Director Kash Patel : ట్రంప్ అంటేనే సంచలనం.. ఎంతమంది కాదన్నా భారతీయుడికే ఎఫ్‌బిఐ చీఫ్ పదవి

FBI Director Kash Patel : ట్రంప్ అంటేనే సంచలనం.. ఎంతమంది కాదన్నా భారతీయుడికే ఎఫ్‌బిఐ చీఫ్ పదవి

FBI Director Kash Patel : భారత సంతతికి చెందిన కాష్ పటేల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించారు. అమెరికా ప్రతిష్ఠాత్మక విచారణ సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ – భారత దేశంలో సిబిఐ లాంటిది) డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన తీర్మానానికి అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.


డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు. అయితే.. ఇలాంటి పదవుల విషయంలో సెనెట్‌ ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్‌లో కాష్‌ పటేల్‌కు అనుకూలంగా 51 పోలయ్యాయి. వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియామకం అధికారికంగా ధ్రువీకరించబడింది. అయితే, రిపబ్లికన్‌లకు మెజార్టీ ఉన్న సెనెట్‌లో కాష్ పటేల్ నియామకంపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ లైన్‌ను ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మైనే మరియు అలస్కా సెనేటర్లు సుశాన్ కొలిన్స్ మరియు లీసా ముర్కోస్కీలు పటేల్‌ నియామకాన్ని వ్యతిరేకించారు. ఇక, ప్రతిపక్ష డెమోక్రాట్లు కూడా పటేల్‌ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేవలం రెండు ఓట్ల తేడాతో ఆయన నియామకానికి ఆమోదం లభించింది.

Also Read: ఇంట్లో చాక్లెట్లు దొంగిలించిందని బాలిక హత్య.. పనిమనిషిపై ఓనర్ల కృూరత్వం


ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నియామకం అనంతరం కాష్‌ పటేల్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ సందర్భంగా తన పోస్ట్ లో.. “అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్‌బీఐని తీర్చిదిద్దుతాను. అమెరికన్లకు హాని చేయాలని ప్రయత్నించే వారు ఈ గ్రహంలో ఎక్కడ ఉన్నా వెంటాడుతాము. నా నినాదం అమెరికా ఫస్ట్.. మిషన్ ఫస్ట్” అని హెచ్చరించారు. ” ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా నాకు స్పష్టమైన లక్ష్యం ఉంది” అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అధ్యక్షుడు ట్రంప్‌కు విధేయుడిగా ప్రవాస భారతీయుడైన కాష్ పటేల్‌కు పేరు ఉంది. పటేల్‌ కుటుంబ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. అయితే ఆయన తల్లిదండ్రుల బాల్యం మాత్రం తూర్పు ఆఫ్రికాలో గడిచింది. ఆయన తండ్రి ఉగాండా నియంత ‘ఇది అమిన్‌’ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లోని గార్డెన్‌ సిటీలో పటేల్‌ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

ఆ తర్వాత యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. కానీ ఆ తరువాత కొంతకాలం నిరుద్యోగిగా ఉన్నారు. ఒక లా సంస్థలో పని చేయాలనుకున్నా ఉద్యోగం లభించలేదు. ఈ కారణంగా మియామీ కోర్టుల్లో పబ్లిక్‌ డిఫెండర్‌గా కొంతకాలం పనిచేసి ఆ తరువాత వివిధ హోదాల్లో సేవలందించారు. ట్రంప్ అధ్యక్షుడి తొలి హయాంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా పటేల్ వ్యవహరించారు. ఇప్పుడు ట్రంప్ రెండో పదవీకాలంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా పదవి చేపట్టారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×