E-Paper
Advertisement

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్
Advertisement

Gachibowli: క్యాబ్ ఎక్కుతుండగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ముద్దుపెట్టాడు ఓ సెక్యూరిటీ గార్డు. ఈ ఘటనతో సదరు టెక్కీ ఒక్కసారిగా షాకైంది. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న ఘటన గచ్చిబౌలిలో వెలుగుచూసింది.

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఊహించని ఘటన

హైదరాబాద్ ఐటీ కారిడార్ గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వెళ్తుంటారు. ఉద్యోగానికి వెళ్లినవారు కొందరైతే, ఇంటికి వచ్చేవారు మరికొందరు. నిత్యం టెక్కీలతో ఆ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. పోలీసులు వివరాల మేరకు.. గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో క్యాబ్ ఎక్కుతున్న 24 ఏళ్ల మహిళా టెక్కీని పక్కకు లాగి ముద్దుపెట్టుకున్నాడు ఓ సెక్యూరిటీ గార్డు.

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు

Advertisement

ఆ మహిళ కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో సదరు టెక్కీ షాకైంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్. అతడి వయస్సు దాదాపు 25 ఏళ్లు. ఇందిరానగర్‌లోని సంతోష్‌దాబాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

ALSO READ: నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!

Advertisement

బాధిత యువతి వైజాగ్‌ నగానికి చెందినది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తూ గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఓ పీజీ హాస్టల్‌లో ఉంటోంది.
ఈ ఘటనతో అక్కడున్న టెక్కీలు షాకయ్యారు. మహిళల భద్రతకు అత్యంత ఇస్తున్న సిటీలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినచర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Related News

తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!

భద్రాద్రి జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

Big Stories

Advertisement
×