E-Paper
Advertisement

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!
Advertisement

Nalgonda Tragedy: నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్‌తో వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిత్యం కంటికి రెప్పలా చూసుకునే భాగస్వామి కళ్లముందే ప్రమాదంలో చిక్కుకోవడంతో, కాపాడుకుందామని వెళ్లిన భర్త కూడా విద్యుదాఘాతానికి గురై తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర శోకాన్ని నింపింది.

టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తూ..

Advertisement

దేవరకొండ పట్టణంలోని అంజయ్య కాలనీకి చెందిన మహమ్మద్ దావుద్ మియా (80), సోఫియా బేగం (60) దంపతులు తమ ఇంట్లో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే ఇంట్లోని పనులు చేసుకుంటున్న క్రమంలో.. సోఫియా బేగం టేబుల్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆ ఫ్యాన్ లేదా స్విచ్‌బోర్డులో విద్యుత్ సరఫరా వైరింగ్ లీక్ అయి ఉండటంతో ఆమెకు బలంగా కరెంట్ షాక్ కొట్టింది.

కాపాడే యత్నంలో ఇద్దరి ప్రాణాలు బలి..

Advertisement

భార్య షాక్‌కు గురై తీవ్ర అరుస్తుండటం గమనించిన భర్త దావుద్ మియా, ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటంతో వెంటనే ముందుకు వెళ్లారు. ప్రమాదాన్ని గమనించకుండా నేరుగా ఆమెను పట్టుకుని లాగేందుకు ప్రయత్నించడంతో, ఆయనకు కూడా విద్యుత్ సరఫరా అయి షాక్ కొట్టింది. ఈ దుర్ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

ఆస్పత్రికి మృతదేహాలు.. విచారం

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కంటికి రెప్పలా కలసిమెలిసి ఉన్న దంపతులు ఇలా ఒక్కసారిగా కరెంట్ షాక్‌తో మృతి చెందడంతో అంజయ్య కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: భద్రాద్రి జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

Tags

Related News

తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

భద్రాద్రి జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి!

జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

Big Stories

Advertisement
×