BigTV English

Sharmila: రాటుదేలిన షర్మిల.. రచ్చ అందుకేనా?

Sharmila: రాటుదేలిన షర్మిల.. రచ్చ అందుకేనా?

Sharmila: షర్మిల ఆమరణ నిరాహార దీక్ష. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇంటి దగ్గరే దీక్ష చేస్తున్నారు. గంటలు, రోజులు గడుస్తున్నాయి. ఆరోగ్యం క్షీణిస్తోంది. అయినా, దీక్ష కొనసాగుతోంది. మీడియా కవరేజీ బాగానే ఉంది. ప్రధాన పార్టీలు, ప్రధాన నాయకులకు ధీటుగా.. వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల చేస్తున్న రాజకీయం.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్.


ఎలాంటి షర్మిల.. ఎలా రాటుదేలారు. పాదయాత్ర కోసం ఆమరణ దీక్షకు దిగారు. హైకోర్టు చెప్పినా.. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో.. నిరసన దీక్ష చేపట్టారు. ముందు ట్యాంక్ బండ్ పై ప్లేస్ చూజ్ చేసుకున్నారు. పోలీసులు అడ్డుకుని లోటస్ పాండ్ కు తీసుకురావడంతో.. ఇక అక్కడే బైఠాయించారు. మరోసారి మీడియా అటెన్షన్ ఆసాంతం తనవైపు తిప్పుకున్నారు.

ఒక ఘటనను.. ఇంతకాలం లాగడం.. ఇంత వరకూ తీసుకురావడం.. చూస్తుంటే షర్మిల రాజకీయం విశ్లేషకులను మెప్పిస్తోంది. ఎక్కడో నర్సంపేట నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంలో షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాటి చేశాయి. ఫ్లెక్సీలు, వాహనం తగలబెట్టాయి. పోలీసులు షర్మిలనే అరెస్టు చేసి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. మామూలుగా అయితే, అక్కడితో ముగిసిపోయేది మేటర్. కానీ, షర్మిల అలా తేలిగ్గా వదిలేయలేదు విషయాన్ని. ధ్వంసమైన కారుతో ప్రగతిభవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించడం.. పోలీసులు అడ్డుకోవడం.. షర్మిల కూర్చున్న కారును క్రేన్ తో ఎత్తేసి పీఎస్ కు తరలించడం.. ఇలా ఆ రోజంతా నాటకీయ పరిణామాలు.


కట్ చేస్తే, షర్మిల హైకోర్టును ఆశ్రయిస్తే.. పాదయాత్రకు పర్మిషన్ రావడంతో ఇక ఎపిసోడ్ అక్కడితో సమాప్తం అనుకున్నారు. కానీ, పోలీసులు మళ్లీ కిరికిరి పెట్టడంతో.. మరోసారి షర్మిల పోరాటం చేయాల్సి వచ్చింది. అది ట్యాంక్ బండ్ నుంచి లోటస్ పాండ్ కు మారి.. ఆమరణ దీక్షకు దారి తీసింది. బలమైన అనుచర వర్గం లేకున్నా.. ప్రజల్లో ఫుల్ ఫాలోయింగ్ కనిపించకున్నా.. షర్మిల సింగిల్ గా ఈ స్థాయిలో రాజకీయం నెరపడం.. కేసీఆర్ సర్కారుకు ఎప్పటికప్పుడు షాకుల మీద షాకులు ఇస్తుండటం చూసి.. ఆమె రాజకీయ పరిణితి మామూలుగా లేదంటున్నారు.

ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా దీక్షతో రాజకీయ ఉద్రిక్తత రాజేశారు షర్మిల. ఇదే దూకుడు ఎలక్షన్ల వరకూ కంటిన్యూ అయితే.. వైఎస్సార్ టీపీ సైతం అసెంబ్లీ బరిలో బలమైన పోటీదారుగా మారే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. విజయమ్మ అన్నట్టు షర్మిలను చూసి కేసీఆర్ సర్కారు భయపడుతోందా? బండి సంజయ్, రాహుల్ గాంధీ పాదయాత్రలకు లేని ఆంక్షలు షర్మిలకే ఎందుకు?

Related News

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Govt: పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. పెండింగ్ బిల్లులు విడుదల

Housing Permission For Rupee: ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూపాయికే నిర్మాణ అనుమతులు

Big Stories

×