BigTV English

Vaishali: కొట్టారు, గిచ్చారు, కొరికారు.. ఘోరంగా ట్రీట్ చేశారు.. నవీన్ తో పెళ్లి కాలేదన్న వైశాలి..

Vaishali: కొట్టారు, గిచ్చారు, కొరికారు.. ఘోరంగా ట్రీట్ చేశారు.. నవీన్ తో పెళ్లి కాలేదన్న వైశాలి..

Vaishali: “నవీన్ రెడ్డితో నాకు పెళ్లి కాలేదు.. ఫోటోలన్నీ ఫేక్.. నన్ను ఘోరంగా ట్రీట్ చేశారు.. కొట్టారు, గిచ్చారు, కొరికారు.. నా చేతిని మెలి వేశారు.. కన్నుపై కొట్టారు.. 10మంది కలిసి ఎత్తుకెళ్లారు”.. ఇదీ కిడ్నాప్ అయిన వైశాలి చెప్పిన వివరాలు.


రెండు రోజులుగా వైశాలి కిడ్నాప్ ఎపిసోడ్ కలకలం రేపింది. 100 మంది యువకులు వైశాలి ఇంటిపై దాడి చేసి.. కుటుంబ సభ్యులను కొట్టి.. ఎత్తుకెళ్లిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకొన్నారు. బాధిత యువతిని రక్షించారు.

ఇంటికి తిరిగొచ్చిన వైశాలి.. కిడ్నాప్ దారుణాన్ని మీడియాకు వివరించింది. తనను గది నుంచి 10 మంది ఎత్తుకెళ్లారని.. డోర్ తీయడానికి ట్రై చేస్తే తన చేతిని తీవ్రంగా గాయపరిచి.. జుట్టు పట్టుకొని కొట్టారని చెప్పింది. తనను వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అంటూ వేడుకున్నా వినలేదని వాపోయింది. తనకు ఇష్టం లేదని చెప్పినా ఒప్పుకోలేదని.. “నీకు ఇష్టం లేకపోతే ఏంటి, నాకు నువ్వంటే ఇష్టం, అందుకే ఎత్తుకొస్తున్నా”.. అని నవీన్ రెడ్డి అన్నాడని చెప్పారు వైశాలి.


తనను బలవంతంగా కారులోకి ఎక్కించి.. తీసుకెళ్లారని.. కారులోంచి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంటే.. తనను గిచ్చారని, కొరికారని, చేతిని మెలేశారని, కన్ను మీద గుద్దారని.. ఆ దారుణాన్ని వివరించారు. తాను సైలెంట్ గా ఉండకపోతే.. తన డాడీని చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చింది.

ఇక, నవీన్ రెడ్డితో పెళ్లి అయినట్టు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు వైశాలి. తమ పెళ్లి అయినట్టు చెబుతున్న తేదీన.. తాను ఆర్మీ హాస్పటిల్లో డెంటల్ ట్రీట్మెంట్లో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. బాట్మెంటెన్ ఆడే టైమ్ లో నవీన్ రెడ్డి పరిచయం అయ్యాడని.. పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే తాను నో చెప్పానని, మా పేరెంట్స్ తో మాట్లాడమని చెప్పానని.. గతంలో తమ మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉండేదని చెప్పారు వైశాలి.

నవీన్ రెడ్డితో తాను సన్నిహితంగా ఉన్నట్టు చూపించన ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసినవేనన్నారు. తన పేరుతో ఫేక్ ఇన్ స్టా ఓపెన్ చేసి మార్ఫింగ్ ఫోటోలను పబ్లిసిటీ చేశారని.. ఇదే విషయంలో గతంలో తాను నవీన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×