BigTV English

BRS Party Updates: ఆ సిట్టింగులకు షాక్!.. ఫస్ట్ లిస్ట్‌పై ఎమ్మెల్యేల్లో టెన్షన్..

BRS Party Updates: ఆ సిట్టింగులకు షాక్!.. ఫస్ట్ లిస్ట్‌పై ఎమ్మెల్యేల్లో టెన్షన్..
Telangana BRS latest news

Telangana BRS latest news(Political news in telangana):

త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌. త్వరలో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకావం ఉండటంతో.. ఫస్ట్‌ లిస్ట్‌ కొందరు నేతల్లో గుబులు పుట్టిస్తోంది. తమకు టికెట్‌ దక్కుతుందో లేదోననే ఆందోళనతో కంటి మీదు కునుకు కరువైంది. కొందరు సిట్టింగ్‌ నేతలకు ఈ సారి టికెట్‌ లేదనే వార్తాలతో టెన్షన్‌లో పడ్డారు ఎమ్మెల్యేలు.


ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టికెట్‌ డౌనేనన్న ప్రచారం జోరందుకుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ నుంచి చొప్పదండి ఎమ్యెల్యే రవిశంకర్‌, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్‌ రమేష్‌, రామగుండం శాసన సభ సభ్యులు కోరుకంటి చందర్‌, జగిత్యాల ఎమ్యెల్యే డాక్టర్‌ సంజయ్‌లను కూడా పక్కన పెట్టే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం.

ఇక ఇదే తరహాలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, జహీరాబాద్ నుంచి కె.మాణిక్ రావులకు కూడా ఈసారి టికెట్‌ దక్కేలా లేదట. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రకటించే లిస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన సిట్టింగ్‌ ఎమ్యెల్యేలు కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌లను పక్కన పెట్టే ఛాన్స్‌ ఉంది.


మరోపక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు చెందిన నేతలది కూడా ఇదే పరిస్థితి. జైపాల్ యాదవ్, నోముల భగత్ బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల పేర్లు లిస్ట్‌లో లేవనే ప్రచారం సాగుతోంది. అదే విధంగా నన్నపునేని నరేందర్, రాములు నాయక్‌, వనమా నాగేశ్వర్‌కు కూడా టికెట్‌ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×