Samantha -Raj: సినీ నటి సమంత(Samantha) డిసెంబర్ ఒకటవ తేదీ ఈషా ఫౌండేషన్ లో యోగ ఆశ్రమంలో ఉన్న లింగ బైరవి ఆలయంలో దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం చాలా సాంప్రదాయ బద్ధంగా భూత శుద్ధి పద్ధతిలో జరిగిన సంగతి తెలిసింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పెళ్లి వేడుక కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొని ఈ వివాహ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభారాజ్ (Sobha Raj)కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈమె స్వయంగా దర్శకుడు రాజ్ కు చిన్నమ్మ కావటం విశేషం. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభ రాజ్ సమంత, రాజ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమంత కోడలిగా మా ఇంటికి రావడం చాలా అదృష్టమని తెలిపారు. సమంత చాలా మంచి అమ్మాయని,చాలా పద్ధతిగా ఉంటారని పెళ్లి చీరలో చాలా చూడముచ్చటగా ఉంది అంటూ సమంత గురించి తెలిపారు. ఇలాంటి అమ్మాయి రాజ్ జీవితంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇకపోతే తాను గతంలోనే ఈషా ఫౌండేషన్ లో సమంతను రెండు మూడు సార్లు కలిశానని తెలిపారు. ఆ సమయంలో అమ్మాయి చాలా సన్నగా ఉండేది. అంత సన్నగా తన పక్కన కూర్చోవాలంటే నాకు కాస్త సిగ్గు అనిపించింది. అప్పుడే నేను ఇలా స్లిమ్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగాను.. అప్పుడు సమంత కొన్ని డైట్ అలాగే వర్కౌట్స్ చెప్పింది అవి నా వల్ల కాదని నేను చెప్పేసానని శోభరాజ్ తెలిపారు. అక్కడ ఉన్న వారందరూ కూడా సమంత గురించి చాలా గొప్పగా చెప్పారని శోభారాజ్ వెల్లడించారు. ఇలా దేవుడిపై ఎంతో భక్తి నమ్మకం ఉన్నటువంటి అమ్మాయి రాజ్ జీవితంలోకి రావడం మంచి పరిణామం అని తెలిపారు.
రాజ్ సింగర్ కూడానా..
ఇక రాజ్ గురించి కూడా మాట్లాడుతూ.. వాడు తన అమ్మ రమా దగ్గర కంటే కూడా నా దగ్గరే ఎక్కువగా ఉండేవాడని, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారని తెలియజేశారు. పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతారని శోభారాజ్ ఈ సందర్భంగా రాజ్ గురించి ఎవరికి తెలియని విషయాలను బయటపెట్టారు. ఇక తనకు సంబంధించి ఏ విషయమైనా తన అక్క తనతో షేర్ చేసుకుంటుందని శోభరాజ్ ఈ సందర్భంగా సమంత రాజ్ నిడిమోరు పెళ్లి గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక సమంత పెళ్లి చేసుకున్న వెంటనే తిరిగి హైదరాబాద్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక వచ్చి రాగానే ఈమె తన సినిమా మా ఇంటి బంగారం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్… కింగ్డమ్ సీక్వెల్ లేనట్టే!