BigTV English

SIT: ఈడీ వర్సెస్ సిట్.. కేసీఆర్ తగ్గేదేలే!

SIT: ఈడీ వర్సెస్ సిట్.. కేసీఆర్ తగ్గేదేలే!

SIT: ఈడీ, సీబీఐలకి బెదిరేదేలే అంటున్నారు. బీజేపీపై తగ్గేదేలే అనేలా దూకుడు పెంచుతున్నారు. మునుగోడు గెలుపుతో జోరు పెంచారు గులాబీ బాస్. అటు, ఫాంహౌజ్ కేసు లోగుట్టంతా రాష్ట్రం చేతికి చిక్కడంతో కమలనాథులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు.


ఈడీ, సీబీఐ దాడులతో తెలంగాణ రాజకీయం దద్దరిల్లుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు లింకులున్నాయంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గ్రానైట్ కంపెనీలపై దాడులంటూ మంత్రి గంగులను.. చీకోటి ప్రవీణ్ కేసులో మంత్రి తలసాని బ్రదర్స్ ను.. ఈడీ టార్గెట్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా, తెలంగాణలో ఈడీ వరుస సోదాలు, అరెస్టులతో ఉద్రిక్తత రాజుకుంటోంది.

కట్ చేస్తే.. మీరేనా, మేమూ చేస్తాం దాడులంటూ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సైతం అలర్ట్ అయ్యాయి. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు దాడులు చేశారు. ఇప్పటికే రెండుసార్లు సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు సీజ్ చేశారు. జీఎస్టీ ఎగ్గొట్టారనే అనుమానంతో ఈ తనిఖీలు జరిగాయి. అయితే, ఇదంతా బీజేపీకి రిటర్న్ ఛాలెంజ్ విసిరేందుకే అనే ప్రచారమూ ఉంది.


ఇక, ఫాంహౌజ్ కేసులోనూ సిట్ యమ సీరియస్ గా దర్యాప్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాడులతో పాటు.. లేటెస్ట్ గా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ను నోటీసులు జారీ చేసింది. నిందితులు సింహయాజుల కోసం తిరుపతి నుంచి హైదరాబాద్ కు శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారనే సమాచారంతో సిట్ ముందు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వడం కీలక పరిణామం. అటు, తుషార్ మీదా ఫోకస్ పెట్టింది సిట్. ఇంతకుముందే నందుకుమార్ కు చెందిన హోటల్ కిచెన్ కూల్చేసి.. యూపీ తరహాలో బుల్డోజర్ వార్నింగ్ కూడా ఇచ్చింది తెలంగాణ సర్కారు.

మీరు ఈడీ అంటే.. మేము సిట్ అంటాం.. అన్నట్టుగా జరుగుతోంది కేంద్ర, రాష్ట్రాల మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్. టీఆర్ఎస్ నేతల లింకులను ఈడీ లాగుతుంటే.. బీజేపీ బడా నాయకుల గుట్టును సిట్ వెలికి తీస్తోంది. ఇలా రిటర్న్ గిఫ్ట్ లతో తెలంగాణ రాజకీయం రంజుగా మారుతోంది.

Related News

Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Big Stories

×