E-Paper
Advertisement

Steroid Racket: తక్కువ టైమ్‌లో సిక్స్ ప్యాక్ బాడీ అంటూ.. హైదరాబాద్‌లో స్టెరాయిడ్స్ కలకలం!

Steroid Racket: తక్కువ టైమ్‌లో సిక్స్ ప్యాక్ బాడీ అంటూ.. హైదరాబాద్‌లో స్టెరాయిడ్స్ కలకలం!
Advertisement

Steroid Racket: స్వేచ్ఛ బ్యూరో: వితిన్​ నో టైం.. సిక్స్​ ప్యాక్​ బాడీ ఖాయమని జిమ్​ లకు వెళ్లే యువకులను టార్గెట్ గా చేసుకుని స్టెరాయిడ్​ ఇంజక్షన్లను అమ్ముతున్న ఆరుగురిని సికింద్రాబాద్ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు, ముషీరాబాద్ పోలీసులతో కలిసి అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున స్టెరాయిడ్​ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్ వాస్తవ్యుడైన బట్టే శివ (32) వృత్తిరీత్యా జిమ్​ ట్రైనర్​. ముషీరాబాద్ లోనే ఉంటున్న స్క్రాప్​ వ్యాపారి మహ్మద్​ ఫుర్ఖానుద్దీన్​ ఫైసల్​ (28), స్టూడెంట్ అయిన మహ్మద్ సైఫ్​ (20), వ్యాపారులు ఫర్జాన్​ ఖాన్​ (20), మహ్మద్ యూసుఫ్​ (26), సొంభశెట్టి అభిలాష్​ (24) అతని స్నేహితులు.

డబ్బు సంపాదన కోసం..

తేలికగా డబ్బు సంపాదించేందుకు ఆన్​ లైన్​ లో జిమ్​ ట్రైనర్​ గా పని చేస్తున్న శివ, ఫుర్ఖానుద్దీన్ కలిసి స్టెరాయిడ్​ ఇంజక్షన్ల విక్రయానికి శ్రీకారం చుట్టారు. ​ఈ క్రమంలో శివ ఉత్తరప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన ముదిద్ చౌహాన్​ నడుపుతున్న మెడిహౌస్ ఫార్మా అనే ఈ కామర్స్ వెబ్​ సైట్ ద్వారా స్టెరాయిడ్ ఇంజక్షన్లను కొని కొరియర్​ డెలివరీ అన్న కొరియర్​ ద్వారా హైదరాబాద్ కు తెప్పించుకుంటున్నాడు. ఇక, ఫుర్ఖానుద్దీన్ పంజాబ్​ కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ కు చెందిన షిప్​ రాకెట్ అన్న ఆన్​ లైన్​ ఈ కామర్స్​ సైట్ ద్వారా స్టెరాయిడ్​ ఇంజక్షన్లు కొని బ్లూ డార్ట్ కొరియర్​ ద్వారా తెప్పించుకోవటం ప్రారంభించాడు. ఇలా తెప్పిస్తున్న ఇంజక్షన్లను గ్యాంగ్ లోని మహ్మద్ సైఫ్​, ఫర్జాన్​ ఖాన్​, మహ్మద్ యూసుఫ్​, సొంభశెట్టి అభిలాష్​ లకు అమ్ముతున్నారు.

Advertisement

Also read: ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!

జిమ్​ కు వెళ్లేవారే..

వీళ్లు దేహధారుఢ్యం కోసం జిమ్​ లకు వెళుతున్న యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ స్టెరాయిడ్​ ఇంజక్షన్లను అమ్ముతూ వస్తున్నారు. ఇంజక్షన్లు తీసుకుంటే తక్కువ సమయంలో సిక్స్​ ప్యాక్​ బాడీ ఖాయమని చెబుతూ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్​ ఫోర్స్​ సీఐ రాజశేఖర్​, ముషీరాబాద్ సీఐ రాజగోపాల్ రెడ్డి, ఎస్​ఐలు మహేశ్​, జ్ఞానదీప్, మణికంఠ రాజు, లక్ష్మీనారాయణ, దుర్గా చౌదరితో కలిసి నిందితులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

పరారీలో ఇద్దరు యువకులు..

Advertisement

వారి నుంచి టెర్మిన్ (నియాన్) – 440 వయల్స్ (ఒక్కొక్కటి 10 మి.లీ), మెఫెన్‌టెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఐపీ – 336 వయల్స్ (ఒక్కొక్కటి 10 మి.లీ), ఒక గ్రీన్ స్పీడ్ ఇంజెక్షన్ , వయల్, టెస్టోస్టెరాన్ ఎథేట్ ఇంజెక్షన్ యుఎస్పీ రొనాల్డో – 50 యాంపౌల్స్ (ఒక్కొక్కటి 1 మి.లీ), ఒక టెస్టోకేర్ ఏ థేట్ ఇంజెక్షన్ , సొమాట్రోపిన్ (ప్యూరిఫైడ్ పెప్టైడ్స్) – 07 యాంపౌల్స్, రెమా స్టోరిల్ (డ్రోస్టానోలోన్ ప్రొపియోనేట్ ఇంజెక్షన్) – 07 యాంపౌల్స్, ఆస్టిమిన్ – 03 (ప్యూర్ క్రిస్టలైన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్) – 200 మిల్లీలీటర్లు, ఇతర సప్లిమెంట్లకు సంబంధించి 336 టాబ్లెట్లతోపాటు మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 6.50 లక్షలు ఉంటుందని డీసీపీ గైక్వాడ్​ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ప్రస్తుతం ఇంజక్షన్ల సప్లయర్లు ముదిద్ చౌహాన్, రాజన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Also read: Greenfield Airport: భద్రాద్రి జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు స్థలాలు ఖరారు..!

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×