SLBC Tunnel Rescue Updates: SLBC టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. టీబీఎమ్ (TBM) ముందు భాగంలో ఒక మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించింది. శిథిలాల కింద కనిపించిన ఓ కార్మికుడి చేయి కనిపించడంతో.. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. SLBC టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ టీమ్ చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటకు వెలికి తీసేందుకు ముమ్మరంగా సహాయకచర్యలు చేపడుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనను ఒక ఛాలెంజ్‌గా తీసుకుంది. దేశంలో ఎక్కడైతే రెస్క్యూ టీమ్స్ మంచి వాళ్లు ఉన్నారో.. వాళ్లను పిలిపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే చాలా మంది కార్మికులు కూడా ఇందులో పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక నాలుగు రెస్క్టూటీమ్‌లు పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. ఆ ఎనిమిది మంది కార్మికుల్లో ఒక మృతుడు చెయ్యి కనిపించింది. ఈ నేపథ్యంలో మృతి దేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా ప్రత్నిస్తున్నారు.
శుక్రవారం రాత్రి కేరళకు చెందిన డాగ్స్ మట్టిలోపల మృతిదేహాలు ఉన్నట్లు గుర్తించాయి. అక్కడ మానవ అవశేషాలు కనిపించాయి. మరింత లోపలికి వెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన మూడు ప్రదేశాల్లో 8 ఫీట్ల మేర తవ్వకాలు జరిపారు. అటు టన్నెల్ దగ్గర రోబోటిక్ అన్వీ బృందం సభ్యులు పరిశీలించారు. రోబోల వాడకంపై అధ్యయనం చేస్తున్నారు. 130 మీటర్ల దూరం ఉన్న కన్వేయర్ బెల్ట్ వరకు బురద మట్టి తరలించేందుకు సమస్యలు తలెత్తుతున్నాయి. JCB సాయంతో బురద మట్టిని కన్వేయర్ బెల్టుపైకి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Also Read: పెండింగ్ నిధులపైసీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్ షురూ
కాగా.. SLBC టన్నెల్‌లో ప్రమాద ప్రాంతం ఎలా ఉంది? అక్కడి పరిస్థితి ఏంటి? రెస్క్యూ ఎలా జరుగుతోంది? ఆ 8 మంది ఎలా చిక్కుకుపోయారు? అసలా ప్రాంతం ఎలా ఉందిప్పుడు? ఇప్పటివరకు అనేక ప్రశ్నలున్నాయి. అధికారులు అందించిన వీడియోలే బయటికి వచ్చాయి. దీంతో అసలక్కడ ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకునేందుకు బిగ్ టీవీ టీమ్ రంగంలోకి దిగింది. అధికారుల అనుమతితో టన్నెల్‌లో ప్రమాద స్థలానికి వెళ్లింది. గ్రౌండ్ జీరోలో ఎలాంటి పరిస్థితులున్నాయి? ఇంతకీ జర్నీ ఎలా సాగింది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ టీమ్. ఆ వివరాలేంటో చూడండి.