BRS Sabha: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? నేతల మధ్య విబేధాలు మొదలయ్యాయా? చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభకు ప్లాన్ చేసిందా? సభ ఓకే.. వేదికపై నేతల మాటేంటి? ఆ సంఖ్య ఎందుకు పెరిగింది? కావాలనే పెంచారా? నేతల నేతల నుంచి ఒత్తిడి పెరిగిందా? ఈ సమస్య చాలామందిని వెంటాడుతోంది. అసలేం జరుగుతోంది?
వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదివారం సాయంత్రం జరగనుంది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరిగిపోయాయి. ఎవరికి బాధ్యతలు వారికి అప్పగించారు. కాకపోతే ప్రతీ నియోజకవర్గం నుంచి కచ్చితంగా ప్రజలను తీసుకురావాల్సిందేనని నేతలకు ఆదేశాలు వెళ్లాయట.
ముఖం చాటేస్తున్న ప్రజలు
అసలే సమ్మర్ సీజన్.. వడ దెబ్బకు చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ సమయంలో సభకు రావడానికి చాలామంది వెనుకంజ వేస్తున్నారు. అయినా సభ సాయంత్రం కాబట్టి ఏలాంటి సమస్య రాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట కొందరు నేతలు.
రజతోత్సవ సభ వేదికపై అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారనేది కేడర్‌తోపాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదే సమయంలో రజతోత్సవ వేదికపై తాము ఉండాలని నాయకుల జాబితా క్రమంగా పెరుగుతోంది. తొలుత 100 మంది స్టేజ్‌పై ఉండాలని ప్లాన్ చేశారట నేతలు. స్టేజి పాసులు మాకు కావాలంటే.. మాకు ఇవ్వాలని నేతలను ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: బీఆర్ఎస్ రజతోత్సవానికి సర్వం సిద్ధం, కేసీఆర్ సభ హైలైట్స్ ఇవే
ఆ విషయం తెలియగానే తాము ఉండాలని కొందరు పట్టుబడుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే సమస్యగా మారిందని అంటున్నారు గులాబీ వర్గాలు. నేతలంతా స్టేజ్‌పై దిగున ఉండేదెవరు? అన్న ప్రశ్నలు లేకపోలేదు. పార్టీ ప్రతిష్టాత్మకమైన చేస్తున్న రజతోత్సవ సభ. చరిత్రలో నిలిచిపోయేలా ఆ ఫోటోలో మన బొమ్మ ఉండాలని పట్టుదలగా చాలామంది ఉన్నారట.
ప్రత్యేక పాసులు ఉన్నవారిని మాత్రమే వేదికపైకి ఆహ్వానిస్తామని వెల్లడించింది పార్టీ. ఆల్రెడీ పాసులు ఓకే అయినవారికి ఫోన్ చేసి తీసుకెళ్లాలని చెబుతున్నారు తెలంగాణ భవన్ సిబ్బంది. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలకు ఖాయం. వారు కాకుండా మిగతా నేతల పోటీ ఎక్కువగా ఉందని అంటోంది పార్టీ భవన్.
పాసులు ఇవ్వాలంటున్న స్టేజ్ ఆర్టిస్టులు
తమకంటే చిన్నవారికి పాసులు ఇస్తున్నారని, మాకెందుకు ఇవ్వరంటూ కార్యాలయం సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారట. విచిత్రం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆఫీసు ముఖం చూడని నేతలు, ఇప్పుడు ఫోన్ చేసి పాసులు అడగడంతో ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇన్నాళ్లు పార్టీలో ఉన్నారో లేదో తెలియని నేతలు వేదిక పాసులపై ఒత్తిడి చేయడం ఆశ్చర్యంగా ఉందన్నది గులాబీ వర్గాల మాట. అధిష్టానం రెడీ చేసిన జాబితా ప్రకారమే పాసులు ఇస్తున్నామని, ఏదైనా ఉంటే నేతలతో మాట్లాడాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. తొలుత 100 మందికి వేదికను రెడీ చేయగా, ఆ సంఖ్య ఇప్పుడు 300 మంది కూర్చొనేలా ఏర్పాటు చేశారని అంటున్నారు.
సభ సక్సెస్ కావాలంటే ప్రజలను మీరు తెచ్చుకోవాలని టార్గెట్ ఇచ్చిన కొందరు నేతలు, వేదిక పాసులు అడిగేసరికి ముఖం చాటేయడంపై కాసింత ఆగ్రహంగా ఉన్నారట. మొత్తానికి వేదిక పాసుల వ్యవహారం గందరగోళానికి దారి తీస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ స్టేజీ ఆర్టిస్టులు సభలో ఎలాంటి లొల్లి చేస్తారేమోనన్న టెన్షన్ కొందరి నేతలను వెంటాడుతోందట.