BigTV English

Pooja Hegde: మోనిక సాంగ్ కోసం పూజా పాట్లు.. కాళ్లు నొక్కించుకుంటూ, ఎండలో మాడిపోతూ.. ఇదిగో వీడియో!

Pooja Hegde: మోనిక సాంగ్ కోసం పూజా పాట్లు.. కాళ్లు నొక్కించుకుంటూ, ఎండలో మాడిపోతూ.. ఇదిగో వీడియో!

Pooja Hegde: పూజా హెగ్డే(Pooja Hegde) ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ సూపర్ హిట్ సినిమాలతో ఎంతో బిజీగా గడిపారు. ఇలా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బుట్ట బొమ్మను క్రమక్రమంగా వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడుతూ వచ్చాయి. ఇలా ఈమె స్టార్ హీరోల సరసన నటించిన ఆ సినిమాలు పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరచడంతో అవకాశాలను కూడా కోల్పోయారు. ఇలా గత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూజా హెగ్డే ఇటీవల తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.


ట్రెండింగ్ లో మోనికా సాంగ్…

ప్రస్తుతం వరుస సినిమాలలో నటించే అవకాశాలను అందుకోవడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లోకేష్ కనగ రాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో రజనీకాంత్(Rajinikanth) హీరోగా నటించిన చిత్రం కూలీ(Coolie). ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో ఇతర భాష హీరోలు కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే.”మోనిక” (monica)అంటూ సాగే ఈ పాటను ఇటీవల విడుదల చేశారు. ఇందులో పూజా హెగ్డే అద్భుతమైన పర్ఫామెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఇక సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ మారుమోగుతున్న సంగతి తెలిసిందే.


అందరికీ ధన్యవాదాలు..

ఇలా ఈ పాటకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో పూజా హెగ్డే సోషల్ మీడియా వేదికగా ఈ పాటను ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా ఈ పాట కోసం ఆమె ఎంతలా కష్టపడ్డారనేది కూడా తెలియజేశారు. ఈ పాట తన సినీ కెరియర్ లోనే ఎంతో అద్భుతమైన పాట అని, అలాగే ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డానని కూడా తెలియజేశారు. ఈ పాట కోసం డాన్స్ చేస్తున్న సమయంలో తీవ్రమైన ఎండ, వేడి కారణంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం నా వంతు నేను ఎంతో కృషి చేశాను, ది బెస్ట్ ఇచ్చానని తెలియజేశారు. ఈ పాట థియేటర్లలో చూడటానికి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు.

నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను కచ్చితంగా ఈ పాటను చూస్తూ థియేటర్లలో మీరు కూడా డాన్స్ చేస్తారని ఈ సందర్భంగా పూజ హెగ్డే ఈ పాట గురించి తెలియజేయడమే కాకుండా ఈ పాట కోసం తాను ఎంతలా కష్టపడ్డాననే విషయాలను కూడా తన ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోలను షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో చూస్తుంటే మాత్రం పూజ హెగ్డే ఈ పాట కోసం చాలా కష్టపడ్డారని స్పష్టమవుతుంది. అయితే పూజ హెగ్డే ఇలా సినిమాలలో స్పెషల్ సాంగ్ చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో రంగస్థలం సినిమాలో ఈమె స్పెషల్ సాంగ్ చేశారు. అలాగే ఎఫ్ 3 సినిమాలో కూడా ఈమె ఒక సాంగ్ లో కనిపించి సందడి చేశారు. మరి మోనిక పాట పూజ హెగ్డేకు ఎలాంటి క్రెడిట్ తీసుకువస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Arjun Kalyan: నన్ను కమిట్మెంట్ అడిగారు.. అర్జున్ కళ్యాణ్ కు చేదు అనుభవం?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×