E-Paper
Advertisement

ట్రెండ్ మారింది.. క్యాప్షన్ రివర్స్ కూడా, పురుషుల సీట్లలో కూర్చుంటే రూ.500 ఫైన్

ట్రెండ్ మారింది.. క్యాప్షన్ రివర్స్ కూడా, పురుషుల సీట్లలో కూర్చుంటే రూ.500 ఫైన్
Advertisement

Hyderabad: ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చాక ట్రెండ్ మారింది. మహిళలు కూడా రూటు మార్చారు. వారి సీట్లలో కాకుండా పురుషుల సీట్లను ఆక్రమించుకుంటున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భాలున్నాయి. కొన్ని బస్సుల్లో వెరైటీ బోర్డు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కొత్త మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

తెలంగాణ ఆర్టీసీలో కొత్త మార్పులు

Advertisement

దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను అమలు చేస్తున్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. ఫలితంగా బస్సుల ఆక్యుపెన్సీ రేషియో అమాంతంగా పెరిగింది.  బస్సుల్లోని సీట్లు మహిళలతో నిండిపోతున్నాయి. మరికొందరైతే ఆక్రమించుకుంటున్నారు. ఫలితంగా పురుష ప్రయాణికులు నిలబడాల్సి వస్తుంది. దీనిపై కండక్టర్‌ని ప్రశ్నిస్తే మాకు ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

పురుషుల సీట్లను ఆక్రమించుకున్న మహిళలు

Advertisement

బస్టాప్‌లో అయితే చెప్పనక్కర్లేదు. బస్సులు ముందు నుంచి కాకుండా.. వెనుకనుంచి మహిళలు ఎక్కేస్తున్నారు.  పురుషుల సీట్లు ఆక్రమించుకుంటున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే సైలెంట్ అవుతున్నారు. మరికొందరైతే గ్రూప్‌గా ఉన్న మహిళలు.. పురుషులపై మాటల ఎదురుదాడి చేయడం మొదలైంది.

 

పురుషుల సీట్లలో కూర్చుంటే రూ.500 ఫైన్

ప్రతీ రోజూ బస్సుల్లో ఇదొక పెద్ద సమస్యగా మారింది. చాలామంది ప్రయాణికులు  ప్రభుత్వాలను ఆడిపోసుకున్న సందర్భాలు కనిపిస్తున్నారు. అలాగని బస్సు రైట్ టైమ్‌కు తీసుకెళ్తున్న సందర్భాలు లేవు. ఈ క్రమంలో తెలంగాణ సిటీ ఆర్టీసీల్లో కొత్తగా బోర్డులు దర్శనమిస్తున్నాయి. పురుషులను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అంటూ ఈ మధ్యకాలంలో బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఒకప్పుడు ఈ తరహా క్యాప్షన్ కేవలం మహిళలకు మాత్రమే ఉండేది. ఉచిత బస్సుల పుణ్యమాని సీన్‌తోపాటు క్యాప్షన్ కూడా రివర్స్ అయ్యింది. వాటిని చూసిన పురుషుల ప్రయాణికులు,  ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఆర్టీసీ వర్గాల నుంచి అందుకన్న సమాచారం మేరకు పురుషుల సీట్లలో మహిళలు కూర్చొంటే రూ.500 ఫైన్ పడుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ALSO READ: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. కొత్తగా లక్ష రేషన్ కార్డులు, మరో వారంరోజుల్లో..

దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈనెల లేదా వచ్చేనెలల్లో దీని గురించి బస్సుల్లో బోర్డు పెట్టే అవకాశముందని అంటున్నారు. ఆ విధంగా పెడితే కనీసం పురుషులు తమకు కేటాయించే సీట్లలో కూర్చొని ట్రావెల్ చేసే అదృష్టం వారికి వస్తుందని అంటున్నారు.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×