BigTV English

Asaduddin Owaisi House Vandalism: ఓవైసీ ఇల్లు ధ్వంసం.. ఢిల్లీ కమిషనర్‌కు సమన్లు జారీ చేసిన లోక్‌సభ స్పీకర్..

Asaduddin Owaisi House Vandalism: ఓవైసీ ఇల్లు ధ్వంసం.. ఢిల్లీ కమిషనర్‌కు సమన్లు జారీ చేసిన లోక్‌సభ స్పీకర్..

Lok Sabha Speaker Summoned Delhi Police Commissioner: ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటి ధ్వంసం ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఓవైసీ జై పాలస్తీనా అనే నినాదం చేసి వివాదాస్పదమైన విషయం తెలిసిందే.


దీంతో ఢిల్లీ అశోకా రోడ్డులోని ఓవైసీ ఇంటిపై గురువారం సాయంత్రం పలువురు దాడి చేశారు. అంతటితో ఆగకుండా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకునలుగురు ఐదుగురు వ్యక్తులు ఓవైసీ ఇంటి గుమ్మంలో, గోడకు మూడు పోస్టర్లు అంటించారని పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులు ఎంపీ ఇంటికి వెళ్లి పోస్టర్లను తొలగించారుని.. వారు వెళ్లేలోపే దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారని అధికారి పేర్కొన్నారు.

ఈ ఘటనపై ఓవైసీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు సమాచారం. అంతే కాకుండా దీనిపై తప్పకుండా చర్య తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.


ఇక అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఓవైసీ వ్యాఖ్యలపై పలువురు ఎంపీలు స్పందించారు. ఎంపీ నవనీత్ కౌర్ మరో అడుగు ముందుకేసి అసద్‌దుద్దీన్ సభ్య త్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాశారు.

Also Read: రాష్ట్రపతికి నవనీత్ కౌర్ లేఖ.. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ..

ఈ విషయంపై లోక్ సభలో కూడా దుమారం రేగింది. బీజేపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ప్రొ టెం స్పీకర్‌ను కోరారు. దీంతో ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ పేర్కొన్నారు.

ఇక ఈ విషయంపై గురువారం ఓవైసీ ఎక్స్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. అలాగే ఎంపీల భద్రతకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందో లేదో తెలియజేయండి అంటూ ఓం బిర్లాను ప్రశ్నించారు ఓవైసీ.

Also Read: ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి, ఎవరి పని?

ఈ వేదికగా అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని తన ఇంటిపై లెక్కలేనన్ని సార్లు దాడి చేశారని.. దీనిపై ఢిల్లీ పోలీసులను వివరణ కోరగా వారు చేతులెత్తేశారని పేర్కొన్నారు. తన ఇంటిని టార్గెట్ చేసే వారిని హెచ్చరిస్తూ సావర్కర్ తరహా పిరికి ప్రవర్తనను ఆపండి అంటూ రాసుకొచ్చారు. సిరా లేదా రాళ్లు విసిరి పారిపోకండి అంటూ ట్వీట్ చేశారు.

ఇంతలో, బహదూర్‌పురా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిని ధ్వంసం చేసేసమయంలఃో దుండగులు జై సియారామ్ అని నినాదాలు చేశారని పేర్కొన్నారు.

కొందరు దుర్మార్గులు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసాన్ని నల్ల ఇంకుతో ధ్వంసం చేసి ‘జై సియారామ్’ నినాదాలు చేశారని.. దీనిపై విచారణ జరిపి, దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×