
Sankranti: సంక్రాంతి వచ్చేస్తోంది. సందడి మొదలైపోతోంది. హైదరాబాద్ సగానికిపైగా ఖాళీ కాబోతోంది. నగరమంతా పల్లెబాట పడుతుంది. వరుస సెలవులు, గ్రామాల్లో సంక్రాంతి సందడితో అంతా సొంతూళ్ల బాట పడుతుంటారు. పండగ రద్దీని తట్టుకోడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించడం కామన్. ఏటేటా జరిగే విషయమే ఇది. ఈసారి కూడా సంక్రాంతికి స్పెషల్ సర్వీసులు నడిపిస్తామని ఇప్పటికే ప్రకటించేసింది టీఎస్ఆర్టీసీ.
స్పెషల్ బస్సులంటే.. అడ్డంగా దోచుకోవడమే అనేది ప్రయాణికులు పాత అనుభవం. మూలకు పడేసిన డొక్కు బస్సులన్నిటినీ బయటకు తీసి.. ప్రత్యేక బస్సుల పేరుతో రేట్లు పెంచేసి.. ఖజానా నింపుకుంటారనే విమర్శ ఉంది. కానీ, ఇదంతా ఒకప్పటి మాట. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చాక.. అంతా మారిపోయింది. ప్రయాణికుడే సంస్థకు ప్రాణం అనే నినాదాన్ని ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా స్పెషల్ దోపిడీకి కూడా చెక్ పెట్టారు.
ప్రత్యేక బస్సుల పేరుతో రేట్లు పెంచడం కాదు.. ఉన్న ఛార్జీలను మరింత తగ్గిస్తూ స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. సంక్రాంతి పండగకు సొంతూర్లు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు బస్సులు నడిపిస్తామని.. 10 శాతం రాయితీ కూడా ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
అవునా. బస్ టికెట్ లో డిస్కౌంట్ కూడానా.. అంటూ అవాక్కవుతున్నారు ప్యాసింజర్లు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు.. రానుపోనూ ఒకేసారి రిజర్వేషన్ చేసుకున్నవారికి మాత్రమే అమలవుతుంది. జనవరి 31 వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ బుకింగ్ కి 10శాతం డిస్కౌంట్ అమలు చేస్తోంది టీఎస్ఆర్టీసీ.
సంక్రాంత్రి సందర్భంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకే ఇలా రాయితీని ప్రకటించినట్టు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ ఆఫర్ ను వినియోగించుకొని.. ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని.. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సంస్థ ఎండీ సజ్జనార్ పిలుపిచ్చారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. 10 పర్సెంట్ డిస్కౌంట్ తో పండగ చేస్కోండి…
Parliament : పార్లమెంట్ సభ్యుల సంఖ్య వెయ్యి దాటుతుందా..? మోదీ ఇచ్చిన సంకేతాలేంటి..?